AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో అత్యధిక సినిమాలు చేసిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం..

మెగాస్టార్ చిరంజీవి.. ఏడు పదుల వయసులోనూ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఇటీవలే సంక్రాంతి కానుకగా మన శంకర్ వరప్రసాద్ గారు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. చిరుతో అత్యధిక సినిమాలు చేసిన తార ఎవరో తెలుసా.. ?

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో అత్యధిక సినిమాలు చేసిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం..
Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Feb 09, 2026 | 5:11 PM

Share

సాధారణంగా సినీరంగంలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం అంటే మాములు విషయం కాదు. ఎన్నో సవాళ్లు, విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే హీరోయిన్ అంటే మంచి కలర్ ఉండాలి. అందంగా ఉండాలి. అన్నింటికీ మించి మంచి అభినయం బాగుండాలి. కానీ కలర్, ఫిట్నె్స్ కాదు.. ప్రతిభ ముఖ్యమని ఇదివరకు చాలా మంది హీరోయిన్స్ నిరూపించారు. అందులో రాధిక ఒకరు. చలాకీతనంతోపాటు చిలిపితనంతో తనదైన ముద్ర వేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. 1980వ దశకంలో వచ్చిన హీరోయిన్లలో ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆమె దాదాపు 20కి పైగా సినిమాల్లో నటించారు. అప్పట్లో చిరంజీవి, రాధిక జోడికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

1978లో తన తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన రాధిక.. ఇప్పటికీ సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ నటిగా బిజీగా ఉంటున్నారు. అలాగే అటు రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటున్నారు. రాధిక.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తండ్రి హాస్యనటుడు ఎం.ఆర్.రాధ. సినీరంగంలో హాస్యనటుడిగా, విలన్ గా పలు సినిమాల్లో నటించారు. రాధిక చెల్లెలు నిరోషా సైతం అప్పట్లో పాపులర్ హీరోయిన్. 1978లో భారతీరాజా దర్శకత్వం వహించిన కిళక్కే పోగుమ్ రైల్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆమె మొదటి హీరో తెలుగు నటుడు సుధాకర్. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత చిరంజీవి నటించిన న్యాయం కావాలి మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

ఆ తర్వాత స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది. కానీ చిరుతో దాదాపు 20 సినిమాలు చేసింది. కిరాయి రౌడీలు, ఇది పెళ్లంటారా, బిల్లా రంగా, యమకింకరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మొండిఘటం, ప్రేమ పిచ్చోళ్లు, పల్లెటూరి మొనగాడు, అభిలాష, శివుడు శివుడు శివుడు, గూఢచారి నంబర్ 1, సింహపురి సింహం, పులి బెబ్బులి, హీరో, జ్వాల, దొంగమొగుడు, ఆరాధన, రాజా విక్రమార్క,.. ఇలా వీరిద్దరి కాంబోలో 20 సినిమాలు వచ్చారు. అంతేకాకుండా అప్పట్లో రాధిక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పించింది. ఇప్పటికీ సినిమాల్లో సహాయ నటిగా కొనసాగుతున్నారు. నిర్మాతగా సక్సెస్ అయిన రాధిక.. ఇటు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటున్నారు.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..