Telangana: ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు.. ఒకే వేదికపై ఒక్కటైన 220 జంటలు..
నాగర్ కర్నూలు జెడ్పీ మైదానంలో సామూహిక వివాహాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కల్యాణాలు జరిపించారు. ఒకే వేదికపై 220 జంటలు ఒక్కటయ్యాయి.

నాగర్ కర్నూలు జెడ్పీ మైదానంలో సామూహిక వివాహాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కల్యాణాలు జరిపించారు. ఒకే వేదికపై 220 జంటలు ఒక్కటయ్యాయి. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు కేశవ రావు, ఎంపీ నామా నాగేశ్వరరావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ కూడా హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు. ఎమ్మెల్యే జనార్థన్ రెడ్డి, జమునారాణి దంపతులు ఐదు రోజులుగా ఈ వివాహ కార్యక్రమాలన్నీ దగ్గరుండి జరిపించారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఉత్సవ విగ్రహలను ఊరేగింపుగా తీసుకొచ్చి పెళ్ళి వేడుకలు నిర్వహించారు. ఈ పెళ్లిళ్లకు 50 వేల మంది వరకూ బంధుమిత్రులు వస్తారనే అంచనాతో గ్రాండ్‌గా విందు భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే ఎంజేఆర్ ట్రస్ట్ నుంచి కొత్త జంటకు పెళ్లి బట్టలు మొదలు, కాపురానికి అవసరమైన కొన్ని సామాన్లను కూడా ఉచితంగానే అందించారు. మర్రి జనార్థన్‌రెడ్డి ట్రస్ట్ తరపున ఇప్పటికే 486 సామూహిక వివాహాలు జరిపించారు. ఇవాళ్టి కల్యాణాలతో కలిపి 706 వివాహాలు జరిగాయి. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు ఘనంగా చేయాలనే సంకల్పంతో.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే చెప్పారు. అన్ని మతాలు గౌరవిస్తూ ఆయా సంప్రదాయాల ప్రకారం వివాహాలు జరిపిస్తున్నామన్నారు.




ఈ సామూహిక వివాహాలకు 2012లోనే ఎంజేఆర్ ట్రస్టు శ్రీకారం చుట్టింది. అప్పట్లో ఒక్కొక్క జంటకు పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించేవారు. 2014లో 84 జంటలకు, 2015 లో 105 జంటలకు, 2017లో 135 జంటలకు, 2019 లో 165 జంటలకు పెళ్లిల్లు.. చేశారు. కరోనా కారణంగా గత మూడు సంవత్సరాలుగా వివాహాలకు బ్రేక్ పడింది. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో హంగు, ఆర్భాటాలతో వివాహాలను జరిపించారు.
Live with Restream https://t.co/S7CTLX0wAl
— Marri Janardhan Reddy (@MJRTRS) February 12, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
