ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.. రూ.5 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందవచ్చు, ఎలాగో తెలుసుకోండి..

Ayushman Bharat Yojana: ప్రతి ఒక్కరూ తాను ఆరోగ్యంగా ఉండాలని, ఏ వ్యాధి చుట్టుముట్టకూడదని కోరుకుంటారు. కానీ దానికి గ్యారెంటీ ఇవ్వలేం. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు.

ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.. రూ.5 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందవచ్చు, ఎలాగో తెలుసుకోండి..
Free Treatment
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 12, 2023 | 7:01 AM

ప్రతి ఒక్కరూ తాను ఆరోగ్యంగా ఉండాలని, ఏ వ్యాధి చుట్టుముట్టకూడదని కోరుకుంటారు. కానీ దానికి గ్యారెంటీ ఇవ్వలేం. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఒక వ్యక్తి అనారోగ్యానికి గురై, చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తే చాలా డబ్బు ఖర్చు అవుతోంది. అయితే, కొంతమంది ఆరోగ్య బీమా ద్వారా చికిత్స పొందుతారు. ఈ ఆరోగ్య బీమా కావాలంటే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.5 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందవచ్చని మీకు తెలుసా? ఇందుకోసం ప్రీమియం కట్టాల్సిన పని కూడా లేదు. ఈ పథకం గురించి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు..

ఆయుష్మాన్ భారత్ యోజన పేరు ఇప్పుడు ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన-ముఖ్యమంత్రి పథకం’గా మార్చారు. ఈ పథకం కింద అర్హులైన వారికి ఆయుష్మాన్ కార్డు జారీ చేయడం జరుగుతుంది. ఈ కార్డు ద్వారా సదరు వ్యక్తులు రూ. 5 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందుతారు. అలాగే ఈ పథకంలో ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.

మీరు అర్హులో కాదో.. ఇలా చెక్ చేసుకోండి..

1. మీరు కూడా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఉచితంగా చికిత్స పొందాలనుకుంటే.. ముందుగా ఈ పథకానికి మీరు అర్హులా? కాదా? తెలుసుకోవాల్సి.

2. మీ అర్హతను తెలుసుకోవడానికి ముందుగా ఈ పథకం అధికారిక పోర్టల్ pmjay.gov.in ను సందర్శించాలి.

3. వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత మీకు టాప్‌లో ‘యామ్ ఐ ఎలిజిబుల్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై మీరు క్లిక్ చేయాలి.

4. ఆ తరువాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

5. సదరు నెంబర్‌కు OTP వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ నమోదు చేయాలి.

6. ఇప్పుడు మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. మొదటిది సెలక్ట్ యువర్ స్టేట్(మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి).

7. రెండవదానిలో మీ మొబైల్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా సెర్చ్ చేయాల్సి ఉంటుంది.

8. ఇలా వివరాలు ఎంటర్ చేసిన తరువాత మీరు పథకానికి అర్హులో కాదో తెలుస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..