PM Modi: 4 రోజులు, 10,800 కిలోమీటర్ల ప్రయాణం, 10 పబ్లిక్ మీటింగ్స్.. ఫుల్ బిజీగా ప్రధాని మోదీ..
4 రోజులు.. 10,800 కిలోమీటర్ల ప్రయాణం.. 10 పబ్లిక్ మీటింగ్స్.. ఇదీ ప్రధాని మోదీ షెడ్యూల్. అటు త్రిపుర ఎన్నికలతో పాటు ఇటు అభివృద్ధి, పాలనా పరమైన అంశాలపై దృష్టి పెట్టారు ప్రధాని.
4 రోజులు.. 10,800 కిలోమీటర్ల ప్రయాణం.. 10 పబ్లిక్ మీటింగ్స్.. ఇదీ ప్రధాని మోదీ షెడ్యూల్. అటు త్రిపుర ఎన్నికలతో పాటు ఇటు అభివృద్ధి, పాలనా పరమైన అంశాలపై దృష్టి పెట్టారు ప్రధాని.
కేవలం 90 గంటల్లోనే 10,800 కిలోమీటర్ల ప్రయాణం..
ఇండియా ప్రధాని అంటే బిజీ బిజీ షెడ్యూల్.. నిత్యం ఏదో ఒక కార్యక్రమాలు ఉంటూనే ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే క్షణం తీరిక ఉండదు. సరిగ్గా మోదీ షెడ్యూల్ కూడా 4 రోజుల పాటు ఇలాగే ఉంది. కేవలం 90 గంటల్లోనే 10,800 కిలోమీటర్ల ప్రయాణం.. అగర్తలా నుంచి ముంబై వరకు లక్నో నుంచి బెంగుళూరు వరకు దేశంలోని అన్ని మూలలను కవర్ చేస్తూ.. ప్రోగ్రామ్‌ల్లో పాల్గొంటున్నారు ప్రధాని మోదీ.
ఒక్కరోజే 2,700 కిలోమీటర్లు..
ఫిబ్రవరి 10న ఢిల్లీ నుంచి లక్నో వెళ్లిన మోదీ.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో పాల్గొన్నారు. అక్కడ నుంచి ముంబై వెళ్లి 2 వందే భారత్ ట్రైన్లను జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు. ఈ ఒక్కరోజే 2,700 కిలోమీటర్లు ప్రయాణించారాయన.
నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన..
ఇక ఫిబ్రవరి 11న త్రిపుర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంబస్సాతో పాటు రాధాకిషోర్‌పూర్‌లో పబ్లిక్ మీటింగ్‌ల్లో ప్రసంగించారు. సుమారు 3000 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించబోయే దయానంద్ సరస్వతి 200వ జయంతి వేడుకల్లో ఇవాళ పాల్గొంటారు ప్రధాని మోదీ. ఆ తర్వాత రాజస్థాన్‌లో నిర్మించబోయే నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత.. రాత్రికి బెంగుళూరు చేరుకుంటారు.
సోమవారం ఏరో ఇండియా 2023 కార్యక్రమం..
ఫిబ్రవరి 13న అంటే సోమవారం ఏరో ఇండియా 2023 కార్యక్రమంలో పాల్గొంటారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ తర్వాత బెంగుళూరు నుంచి నేరుగా త్రిపుర రాజధాని అయిన అగర్తలాకు బయలుదేరి వెళ్తారు. అక్కడ ర్యాలీతో పాటు బహిరంగ సభల్లోనూ పాల్గొంటారు. ఈ మొత్తం ప్రయాణం 3,350 కిలోమీటర్ల పైనే. కాగా, త్రిపురలో 60 స్థానాలకు ఈ నెల 16న పోలింగ్ జరగనుంది. అక్కడ ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో బీజేపీ పనిచేస్తోంది. స్వయంగా ప్రధానితోనే వరుస ర్యాలీలు, సభలు ప్లాన్ చేస్తోంది. ఈ ఎన్నికల్లోనూ గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆపార్టీ నేతలు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..