Earthquakes in India: దేశంలోని ఈ రెండు రాష్ట్రాల్లో టర్కీ తరహాలో భారీ భూకంపాలు వచ్చే ఛాన్స్.. సంచలన రిపోర్ట్..
భారత్‌కు భారీ భూకంపం వచ్చే ప్రమాదం ఉందా? భారత్ భారీ భూకంప ముప్పు తప్పదని ఐఐటీ ప్రొఫెసర్ సంచలన విషయాన్ని వెల్లడించారు. హిమాలయన్ జోన్ అత్యంత దుర్బలమైనదని చెప్పారు.

టర్కీ , సిరియాలో సంభవించిన వినాశకరమైన భూకంపంలో ఇప్పటివరకు 12 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 25 వేల మందికి పైగా గాయపడ్డారు. బాధితులను ఆదుకునేందుకు ఇతర దేశాల నుంచి సహాయ సామగ్రిని పంపుతున్నారు. అయితే వీటన్నింటి మధ్య మెదిలే ఒక ప్రశ్న భారతదేశంపై భూకంప ప్రభావిత ప్రాంతాల పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. ప్రభుత్వం ప్రకారం, భారతదేశ భూభాగంలో దాదాపు 59 శాతం భూకంపాలకు గురయ్యే అవకాశం ఉంది. ఎనిమిది రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలోని నగరాలు , పట్టణాలు జోన్-5లో ఉన్నాయి. ఈ జోన్ లోని ప్రాంతాల్లో అత్యధిక తీవ్రతతో భూకంపాలు సంభవించే ప్రమాదం ఉంది. దేశ రాజధాని డిల్లీ సైతం జోన్-4లో ఉండటం విశేషం.
అంతేకాదు భారత్‌కు భారీ భూకంపం సంభవించే ప్రమాదం ఉందని. ఐఐటీ కాన్పూర్‌లోని ఎర్త్ సైన్స్ విభాగానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టర్కీ మాదిరిగానే, భారతదేశంలో కూడా బలమైన భూకంపం సంభవించే అవకాశం ఉందని ప్రొఫెసర్ జావేద్ మాలిక్ చెబుతున్నారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో 7.5 తీవ్రతతో భూకంపాలు సంభవించవచ్చని ప్రొఫెసర్ మాలిక్ తెలిపారు.
దేశంలో భూకంపాలు సంభవించిన చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే, భారతదేశంలోని మొత్తం భూభాగంలో 59% భూకంపాలకు గురయ్యే అవకాశం ఉంది. దేశంలోని సీస్మిక్ జోనింగ్ మ్యాప్ ప్రకారం మొత్తం ప్రాంతాన్ని నాలుగు సీస్మిక్ జోన్లుగా వర్గీకరించారు. జోన్ 5 అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవించే ప్రాంతం, అయితే జోన్ 2లో అతి తక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తాయి.




దేశ వైశాల్యంలో దాదాపు 11% జోన్ 5లో, 18% జోన్ 4లో 30%, జోన్ 3, జోన్ 2లో మిగితా ప్రాంతాలు ఉన్నాయి. మొత్తం ప్రాంతాన్ని నాలుగు భూకంప మండలాలుగా వర్గీకరించారు. జోన్ 5 అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవించే ప్రాంతం. జోన్ 2లో అతి తక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తాయి. జోన్ 5 అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవించే ప్రాంతంగా గుర్తిస్తారు.
ఈ రాష్ట్రాల్లో భూకంప ప్రమాదం ఎక్కువ:
నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అనే ప్రభుత్వ సంస్థ. దేశవ్యాప్తంగా, భూకంపాలను పర్యవేక్షించే 115 అబ్జర్వేటరీలను కలిగి ఉంది. దీని అధ్యయనంలో మధ్య హిమాలయ ప్రాంతం ప్రపంచంలో అత్యంత చురుకైన భూకంప ప్రభావిత ప్రాంతాలలో ఒకటి.
ఇదిలా ఉంటే వచ్చే ఒకటి రెండు దశాబ్దాల్లో లేదా ఒకటి రెండేళ్లలో ఎప్పుడైనా సరే దేశంలోని రెండు ప్రాంతాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. “భూకంపం కేంద్రం హిమాలయాలు లేదా అండమాన్ మరియు నికోబార్ దీవులలో ఉండే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ జావేద్ మాలిక్ అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..