Bizarre: ఇదో రకమైన సంప్రదాయం.. మొగుళ్లను తన్నిన తరువాతే భోజనం పెట్టే పెళ్లాలు..!
ప్రపంచం అంతుచిక్కని రహస్యాలకు నెలవు. లక్షలాది జాతులకు ఆవాసం భూమి. విభిన్న జాతుల జంతువులు ఉన్నట్లు.. మనుషుల్లోనూ విభిన్న జాతుల వారు, తెగల వారు ఉంటారు. ఈ తెగలలో అనేక వింత సంప్రదాయాలు అనుసరించే
ప్రపంచం అంతుచిక్కని రహస్యాలకు నెలవు. లక్షలాది జాతులకు ఆవాసం భూమి. విభిన్న జాతుల జంతువులు ఉన్నట్లు.. మనుషుల్లోనూ విభిన్న జాతుల వారు, తెగల వారు ఉంటారు. ఈ తెగలలో అనేక వింత సంప్రదాయాలు అనుసరించే వారు కూడా ఉన్నారు. వాటి గురించి తెలిస్తే కొంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ తెగలు విభిన్న ప్రాముఖ్యత కలిగిన అనేక ప్రత్యేక సంప్రదాయాలను అనుసరిస్తాయి. వారి ఆచార సంప్రదాయాలు విన్నా, చూసినా గూస్‌బంప్స్ వస్తాయి. వారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసి ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఇవాళ మనం అలాంటి వింత ఆచారాన్ని పాటించే ఓ తెగ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ తెగలో మహిళలు తమ భర్తలను తన్నిన తరువాతే భోజనం వడ్డిస్తారు. లేదంటే ఆ పూటకు పస్తులేనట. ఈ వింత ఆచారానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నేపాల్ దేశంలోని థారు తెగ ప్రజల ఆచార సంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వీరు ఒకప్పుడు భారతదేశంలో నివసించేవారు అయినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల అక్కడ సెటిల్ అయ్యారు. నాటి నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను ఈ తెగ ప్రజలు నేటికి పాటిస్తుంటారు. ఈ తెగ ప్రజలది మాతృస్వామ్య సంప్రదాయం. తల్లే ఇంటికి అధినేత్రి. ఆమె ఆజ్ఞలను అందరూ పాటించి తీరాల్సిందే.
భర్తను తన్నిన తరువాతే అన్నం..
ఈ తెగకు సంబంధించి, 1576 సంవత్సరంలో హల్దీఘాటి యుద్ధంలో, మహారాణా ప్రతాప్ సైన్యంలోని సైనికులు, రాజ ప్రముఖులు తమ కుటుంబాల భద్రత కోసం హిమాలయాల దిగువ ప్రాంతాలకు వెళ్లారు. అదే తెరాయ్ ప్రాంతం. ఈ ప్రాంతంలో వారు నివాసం ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత దీనిని తరు అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడికి చేరుకున్న తర్వాత రాజ కుటుంబాలకు చెందిన మహిళలు తమ భద్రతకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి, సదరు మహిళలు తమ కంటే తక్కువ స్థానాల్లో ఉన్న సైనికులను వివాహం చేసుకున్నారు.
అయితే ఈ వివాహం పట్ల ఈ స్త్రీలందరూ ఏమాత్రం సంతోషంగా లేరు. దీంతో భర్తకు ఇవ్వాల్సిన గౌరవం దక్కలేదు. వారు అగ్రవర్ణ, రాజకుటుంబానికి చెందినవారనే గర్వంతో ఉండేవారు. ఈ గర్వంలోనే సదరు మహిళలు తమను తాము కుటుంబ పెద్దలుగా భావించారు. ఈ క్రమంలోనే తమ భర్తలను తన్నిన తరువాత మాత్రమే ఆహారం పెట్టేవారు. ఇలా ఆహారం వడ్డించడం ద్వారా వారి రాజదర్పాన్ని అణచుకునేవారు. అయితే, కాలం మారినా ఈ తెగ ఆచార సంప్రదాయాలు మాత్రం మారలేదు. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.
మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..