Telangana: వివాహిత ప్రాణం తీసిన మిస్డ్ కాల్ పరిచయం.. కొంతకాలం తర్వాత ఏం జరిగిందంటే..?
Warangal News: ఆమెకు పెళ్లైంది.. ఓ ప్రైవేట్ కళాశాలలో పని చేస్తోంది.. ఈ క్రమంలో ఓ వ్యక్తి మిస్డ్ కాల్ ఇచ్చాడు. దానికి రిప్లే ఇచ్చినందుకు.. ఆమెను మాటల్లో పెట్టి పరిచయం పెంచుకున్నాడు.
Warangal News: ఆమెకు పెళ్లైంది.. ఓ ప్రైవేట్ కళాశాలలో పని చేస్తోంది.. ఈ క్రమంలో ఓ వ్యక్తి మిస్డ్ కాల్ ఇచ్చాడు. దానికి రిప్లే ఇచ్చినందుకు.. ఆమెను మాటల్లో పెట్టి పరిచయం పెంచుకున్నాడు. అనంతరం తన కోరిక తీర్చమంటూ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో అతని వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ షాకింగ్ ఘటన వరంగల్ కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ లోని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన ఆకుతోట సౌజన్య హంటర్ రోడ్ లోని ఓ ప్రయివేటు కాలేజీలో జాబ్ చేస్తుంది. గత కొన్ని రోజుల క్రితం ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన తిరుపతి నుంచి ఆమెకు మిస్డ్ కాల్ వచ్చింది.. దీంతో ఆమె దానికి రిప్లై ఇచ్చింది. ఆమెను మాటల్లో పెట్టిన తిరుపతి.. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం సౌజన్యను లోబర్చుకోవడానికి స్కెచ్ వేశాడు..
సౌజన్య మంచి తనాన్ని అదునుగా భావించిన.. తిరుపతి ఆమెను లొంగ తీసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా ఆమె ఫోన్ ట్రాప్ చేసి.. తన కోరిక తీర్చమని వేధించాడు. లేకపోతే తన భర్తకు, బంధువులకు ఫోన్ చేసి కాపురంలో చిచ్చు పెడతానని బెదిరించాడు. ఈ వేధింపులు కాస్త తీవ్రమవ్వడంతో సౌజన్య ఇక భరించలేక బుధవారం ఇంట్లోని సంపులో దూకి ఆత్మహత్యకు యత్నించింది.
గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం దక్కలేదు.. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సౌజన్య మృతి చెందింది. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు స్థానిక మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..