CM KCR Live: ధరణి పోతే పట్టాలు ఇవ్వడానికి 6 నెలలు పడుతుంది: సీఎం కేసీఆర్
ఆసిఫాబాద్‌లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన కేసీఆర్.. జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పను సీట్లో కూర్చొబెట్టారు. అనంతరం కలెక్టరేట్ ప్రారంభించారు. ఆపై ప్రగతి నివేదన సభ వేదికకు చేరుకుని ప్రసంగించారు.
ఆసిఫాబాద్‌లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన కేసీఆర్.. జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పను సీట్లో కూర్చొబెట్టారు. అనంతరం కలెక్టరేట్ ప్రారంభించారు. ఆపై ప్రగతి నివేదన సభ వేదికకు చేరుకుని ప్రసంగించారు. గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ చేశారు.28 జిల్లాలు, 295 మండలాలు, 2 వేల 845 గ్రామ పంచాయతీల పరిధిలో ఫారెస్ట్ రైట్స్ కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. 12 లక్షల 49 వేల 296 ఎకరాలకు సంబంధించి 4 లక్షల 14 వేల 353 క్లెయిమ్స్‌ను వివిధ స్థాయిలో పరిశీలించి, 28 జిల్లాల పరిధిలో 4 లక్షల 6 వేల 369 ఎకరాల భూమిపై లక్షా 51 వేల 146 మంది లబ్ధిదారులు పోడు పట్టాలు పొందేందుకు అర్హులుగా గుర్తించారు. పంపిణీ చేసే పోడు భూములకు ఈ వానకాలం పంట నుంచే రైతుబంధు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య మరో లక్షా 51 వేలు పెరగనుంది. 4 లక్షల ఆరు ఎకరాలకు రైతుబంధు కింద ప్రభుత్వంపై ఏటా 406 కోట్ల రూపాయల భారం పడనుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

