YS Viveka Case: వివేకా హత్య కేసులో ముగిసిన సీబీఐ విచారణ.. తుది నివేదికలో పలువురి పేర్లు..

YS Vivekananda Reddy murder case: వైఎస్‌ వివేకా హత్య కేసులో ట్విస్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఈ రోజుతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో

YS Viveka Case: వివేకా హత్య కేసులో ముగిసిన సీబీఐ విచారణ.. తుది నివేదికలో పలువురి పేర్లు..
YS Vivekananda Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 30, 2023 | 12:17 PM

YS Vivekananda Reddy murder case: వైఎస్‌ వివేకా హత్య కేసులో ట్విస్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఈ రోజుతో ముగుస్తోంది. గతంలో అత్యున్నత న్యాయస్థానం జూన్‌ 30లోగా వివేకా కేసులో పూర్తి వివరాలు బయటపెట్టాలని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ రోజు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగబోతోంది. ఈ క్రమంలోనే.. మరోవైపు నాంపల్లి సీబీఐ కోర్టులో వివేకా హత్య కేసు విచారణ జరుగుతోంది. నిందితులను పోలీసులు సీబీఐ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వివేకా హత్యకేసు విచారణలో ఏంజరగబోతోందన్న సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో సీబీఐ కోర్టు విచారణను మరోసారి వాయిదా వేసింది.

వాస్తవానికి సీబీఐ కోర్టు విధించిన గడువు ఇవాళ్టితో ముగిసిన నేపథ్యంలో సీబీఐ అధికారులు సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే, చార్జ్‌షీట్‌లో కీలక వ్యక్తుల పేర్లను సీబీఐ అధికారులు ప్రస్తావించారు. దీంతో వైఎస్ వివేకా కేసు విచారణను జులై 14కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

ఇదిలాఉంటే.. వైఎస్ వివేకా కేసులో సుప్రీంకోర్టు విచారణకు ముందు.. ఈ కేసు దర్యాప్తును ముగించినట్లు సీబీఐ పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి నివేదికను సుప్రీంకు సమర్పించింది. అయితే.. సుప్రీంకోర్టు విధించిన గడవు మేరకు దర్యాప్తును ముగించామని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పేర్లు జులై 3న సుప్రీం కోర్టులో జరిగే విచారణలో బయటకు రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..