Hyderabad: దేశంలోనే అతిపెద్ద మాల్.. రేపే హైదరాబాద్‌‌లో ప్రారంభం

మహానగరంలో మరో మహా షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది. కేపీహెచ్‌బీలో లులు గ్రూప్ ఏర్పాటు చేసిన లులు మాల్ నగరవాసులకు మరొక షాపింగ్ స్పాట్‎గా నిలుస్తోంది. దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో అతిపెద్ద మాల్ తో తెలంగాణలో అడుగుపెట్టింది లూలూ ఇంటర్నేషనల్ గ్రూప్. ఇప్పుడున్న మాల్స్‎కి.. కొత్తగా వచ్చిన ఈ లులు మాల్ ప్రత్యేకతలెంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో కొత్తగా లులు మాల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. బుధవారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ బిగ్ మాల్ ప్రారంభం కానుంది.

Hyderabad: దేశంలోనే అతిపెద్ద మాల్.. రేపే హైదరాబాద్‌‌లో ప్రారంభం
Lulu Mall
Follow us
Vidyasagar Gunti

| Edited By: Aravind B

Updated on: Sep 26, 2023 | 5:20 PM

మహానగరంలో మరో మహా షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది. కేపీహెచ్‌బీలో లులు గ్రూప్ ఏర్పాటు చేసిన లులు మాల్ నగరవాసులకు మరొక షాపింగ్ స్పాట్‎గా నిలుస్తోంది. దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో అతిపెద్ద మాల్ తో తెలంగాణలో అడుగుపెట్టింది లూలూ ఇంటర్నేషనల్ గ్రూప్. ఇప్పుడున్న మాల్స్‎కి.. కొత్తగా వచ్చిన ఈ లులు మాల్ ప్రత్యేకతలెంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో కొత్తగా లులు మాల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. బుధవారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ బిగ్ మాల్ ప్రారంభం కానుంది. లులు ఇంటర్నేషనల్ గ్రూప్ ప్రపంచంలో 22 దేశాల్లో 250 బ్రాంచీలతో మార్కెటింగ్ కొనసాగిస్తోంది. భారత్‌లో ఇప్పటికే ఐదు మాల్స్‎ను వివిధ నగరాల్లో లులు ఓపెన్ చేసి చేసింది తెలంగాణలో తొలిసారిగా హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఇప్పుడు మాల్‌ను ప్రారంభించనుంది.

రాష్ట్రంలో 3500 కోట్ల పెట్టుబడును ఫుడ్ డీటెయిల్స్ సెక్టార్‌లో పెడతామని దావోస్ సమీట్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ మేరకు తొలి విడతగా షాపింగ్ మాల్‌లో 500 కోట్ల పెట్టుబడులు పెట్టామని ఈ సంస్థ చెబుతోంది. సాధారణంగా మాల్స్ అనగానే అందులోకి ఎంటర్ కాగానే బిగ్ ఓపెన్ స్పేస్, చుట్టూ బహుళ అంతస్తులో షాపులు, ఫ్యాషన్ స్టోర్లు, మొబైల్ స్టోర్లు ఇంకా ఎన్నో రకాల షాప్స్ తో కలర్ ఫుల్‎గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు లులు మాల్‌లో హైపర్ మార్కెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వివిధ సూపర్ మార్కెట్లు బిగ్ మార్కెట్ తరహాలో ఫుడ్ మెటీరియల్, గ్రోసరీ ఐటమ్స్, ఫ్రూట్స్ వెజిటేబుల్స్, హోం అప్లియన్సెస్ ఎలక్ట్రానిక్ సహా ఇంటికి కావలసిన అన్ని వస్తువులు లభించే చోటుగా ఈ హైపర్ మార్కెట్‌ను నిర్మించారు. మీట్ ఫిష్‌తో పాటు ఏ టు జెడ్ ఈ సూపర్ హై మార్కెట్లో లభిస్తున్నాయి.

నగరంలో ఇప్పటికే ఎన్నో మాల్స్ ఉండగా ఈ మాల్ లో హైపర్ మార్కెట్ పేరుతో ఇంట్లో దొరికే ప్రతి వస్తువు.. వినియోగించే ప్రతి పప్పు దినుసులు, గ్రోసరీ ఐటమ్స్, కూరగాయల వరకు అన్ని ఒకే చోట లభించేలా ఏర్పాటు చేశారు. తమ బ్రాండ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ హైపర్ మార్కెట్‌ను ప్రజలు ఆదరిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు . అలాగే వరల్డ్ క్లాస్ షాపింగ్ మాల్ పేరుతో లులు అతిపెద్ద కాంప్లెక్స్‎ను నిర్మించింది. ఈ మల్టీపర్పస్ బిల్డింగ్‎లో హైపర్ మార్కెట్‎తో పాటు రిలాక్సింగ్ స్పా, ఫుడ్ కోర్ట్స్, కాంప్లెక్స్ తోపాటు 1400 మంది కూర్చునే ఐదు స్క్రీన్లతో సినీ పాలీస్‌లను కూడా ఏర్పాటు చేశారు. పిల్లలు పెద్దలు వినోద భరితంగా ఎంజాయ్ చేసే విధంగా షాపింగ్ మాల్ లో సౌకర్యాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా.. కొచ్చి, తిరువనంతపురం, బెంగళూరు, లక్నో, కోయంబత్తూర్‌లలో ఇప్పటికే ఈ లులు మాల్స్ ఉండగా హైదరాబాదులో ప్రారంభించబోయేది ఆరవది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా మరిన్ని పెట్టుబడులు పెట్టబోతున్నామని లులు సంస్థ చెబుతోంది. తెలంగాణ టైర్-2 సిటీస్‎లో కూడా చిన్న చిన్న మాల్స్ ఓపెన్ చేస్తామని లులు ప్రతినిధులు తెలిపారు. ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభవం పొందేలా వరల్డ్ ఆఫ్ హ్యాపీనెస్ అనే టాగ‌లైన్‎తో ఈ లులు ప్రారంభిస్తున్నారు. అయితే ఇక్కడి వచ్చే కస్టమర్లకి ఓ మంచి అనుభవాన్ని ఉంటుందని చెబుతోంది లులు షాపింగ్ మాల్ యాజమాన్యం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..