AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపు జగిత్యాలలో ప్రధాని మోదీ సభ.. 1,600 మంది పోలీసుల బందోబస్తు

జగిత్యాలలో ప్రధాని నరేంద్ర మోదీ సభకు సర్వం సన్నద్ధమైంది. ప్రధాని టూర్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే రెండు రోజుల నుంచి పోలీస్ పహారాలో జగిత్యాల ఉండగా, సభా ఏర్పాట్లకు సంబంధించి ఎంపీ అరవింద్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మరోవైపు రేపటి మోదీ సభలో ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

రేపు జగిత్యాలలో ప్రధాని మోదీ సభ.. 1,600 మంది పోలీసుల బందోబస్తు
Pm Modi
G Sampath Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Mar 17, 2024 | 8:03 PM

Share

జగిత్యాలలో ప్రధాని నరేంద్ర మోదీ సభకు సర్వం సన్నద్ధమైంది. ప్రధాని టూర్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే రెండు రోజుల నుంచి పోలీస్ పహారాలో జగిత్యాల ఉండగా, సభా ఏర్పాట్లకు సంబంధించి ఎంపీ అరవింద్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మరోవైపు రేపటి మోదీ సభలో ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

పార్లమెంట్ ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలూ రాజకీయ సభలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఓవైపు పాదయాత్రలు, మరోవైపు ప్రచారం కోసం సభలను ఎంచుుకుంటున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా సుడిగాలి పర్యటన చేస్తున్న ప్రధాని మోదీ.. సోమవారం, మార్చ్ 18వ తేదీన జగిత్యాలకు రానున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ వేదికగా, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపెల్లి పార్లమెంట్ సెగ్మెంట్స్‌కు సంబంధించిన ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఈ క్రమంలో సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ పూర్తి కావచ్చాయి.

నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో సభ ఏర్పాటు చేయడంతో ఎంపీ అరవింద్ అన్నీ తానై ఏర్పాట్లను పరిశీలించారు. మరోవైపు అరవింద్ తోపాటు ఈ సభకు మరో సిట్టింగ్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ తదితరులు హాజరుకానున్నారు. భారీ ఎత్తున జన సమీకరణకు ఇప్పటికే కాషాయ శ్రేణులు నడుం బిగించాయి. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు జరుగబోయే సభలో పాల్గొనే మోదీ.. ఆ తర్వాత 12 గంటల 30 నిమిషాలకు తిరిగి వెళ్లిపోనున్నారు. ప్రధాని హోదాలో మోదీ వస్తుండటంతో సుమారు 16 వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ ఇప్పటికే విస్తృతమైన తనిఖీలు చేయడంతో పాటు.. సభా ప్రాంగణం, పరిసరాలను ఎస్పీజీ అధీనంలోకి తీసుకుంది. భద్రతాపరంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా పరిశీలించారు.

ఓవైపు కవిత అరెస్ట్.. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్.. ఇంకోవైపు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని షుగర్ ఫ్యాక్టరీస్ ను తెరిపిస్తామని కాంగ్రెస్ అడుగులు వేస్తుండటం.. మరోవైపు ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ పసుపు బోర్డ్ ప్రకటన చేయడంతో.. ఈ అంశాలన్నీ రేపటి మోదీ ప్రసంగంలో ఉండే అవకాశముంది. వీటితో పాటు సీఏఏ, ఎన్ఆర్సీ, రామ్ మందిర్ వంటి పలు అంశాలపై మాట్లాడటంతోపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ హామీలు.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పైనా మోదీ తనదైన శైలిలో విరుచుకుపడే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల శంఖారావంలో భాగంగా మోదీ ఏం మాట్లాడబోతున్నారన్నదీ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. జగిత్యాల కేంద్రంగా ఏర్పాటు చేసిన ఈ సభకు ఇటు నిజామాబాద్ పార్లమెంట్ తో పాటు అటు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లోని ప్రజలతో పాటు. మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని ప్రజలందరినీ సమీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ శ్రేణులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…