ఆ ప్రభావం కాంగ్రెస్‌పై పడనుందా.. వారి డిమాండ్‌పై ప్రభుత్వ స్పందన ఏంటి..
మాజీ సర్పంచులు ఆందోళన బాట పడుతున్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఒత్తిడితో బలవంతంగా పనులు చేయించిందని చెబుతున్నారు. బిల్లుల విషయంలో జాప్యం చేసి.. సర్పంచ్‌గా పదవీకాలం ముగిసి ఐదు నెలలు గడుస్తున్న నిధులు మంజూరు చేయలేదంటున్నారు. దీంతో గద్యంతరం లేక మాజీ సర్పంచ్‌లు పోరుబాటకి సిద్ధం అవుతున్నారు.
మాజీ సర్పంచులు ఆందోళన బాట పడుతున్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఒత్తిడితో బలవంతంగా పనులు చేయించిందని చెబుతున్నారు. బిల్లుల విషయంలో జాప్యం చేసి.. సర్పంచ్‌గా పదవీకాలం ముగిసి ఐదు నెలలు గడుస్తున్న నిధులు మంజూరు చేయలేదంటున్నారు. దీంతో గద్యంతరం లేక మాజీ సర్పంచ్‌లు పోరుబాటకి సిద్ధం అవుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు గ్రామ పంచాయతీలలో పెద్ద ఎత్తున పెండింగ్ బిల్లులు పేరుకు పోయాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు హాడవుడిగా పనులు చేయించారంటున్నారు. అంతే కాకుండా గత ఐదేంళ్లలో చేసిన అభివృద్ధి పనులకి కూడ బిల్లులు సరిగా రాలేదని చెబుతున్నారు. అర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇద్దరూ సర్పంచ్‌లు అత్మహత్యలు చేసుకున్నారు. చాల మంది అప్పుల బాధలు భరించలేక ఆస్తులు అమ్ముకున్నారు. చిన్న చిన్న గ్రామ పంచాయతీలలో సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదంటున్నారు. ఇప్పటికీ అరు నెలల నుండి మాజీ సర్పంచులు బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నామని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా నూతన ప్రభుత్వం దృష్టికి కూడ తీసుకెళ్లామన్నారు. స్మశానవాటికల నిర్మాణం, నూతన గ్రామ పంచాయతీల నిర్మాణం, ఇతర మౌళిక వసతుల కోసం నిధులు ఖర్చు చేశామని చెబుతున్నారు. అప్పుడు పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో సర్పంచులే పనులు చేసినట్లు తెలిపారు. ఇప్పటికీ పదిశాతం బిల్లులు కూడ మంజూరు కాలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగష్టు నెలలో గ్రామ పంచాయతీకి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం నుండి సంకేతాలు వస్తున్నాయి. అయితే పెండింగ్ బిల్లులు విడుదల చేసిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని మాజీ సర్పంచులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పెండింగ్ బిల్లులు కొత్త ప్రభుత్వానికి అదనపు భారంగా మారింది. మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు మైనర్ గ్రామ పంచాయతీలలో కూడ ఎక్కడిక్కడ బిల్లులు పేరుకు పొయాయి. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి సక్రమంగా నిధులు కాకపోవడంతో ఇప్పుడు పాలనపైనా ప్రభావం చూపనుంది. మైనర్ గ్రామపంచాయతీలలో పారిశుద్ద్య సిబ్బందికి కనీసం వేతనం ఇచ్చే అర్థిక పరిస్థితి కూడ లేదు. గ్రామపంచాయతీ నిధులు పెండింగ్‌లో ఉండటంతో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో మాజీ సర్పంచులు కూడ మరింత ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్దమవుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి గ్రామపంచాయతీ పెండింగ్ బిల్లులని విడుదల చేయాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…