Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాహనదారులకు హెచ్చరిక.. ఇకపై టూవీలర్స్‎ అలా చేస్తే లైసెన్స్ రద్దు.. పోలీసులు కీలక ఆదేశాలు..

ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేయకూడదు. ఒకవేళ మార్పు చేస్తే వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానికిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు బుధవారం సి. పి. ఓ జంక్షన్ వద్ద అధిక శబ్ధం చేసే ద్విచక్రవాహన సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని రోడ్ రోలర్‎తో ధ్వంసం చేశారు.

వాహనదారులకు హెచ్చరిక.. ఇకపై టూవీలర్స్‎ అలా చేస్తే లైసెన్స్ రద్దు.. పోలీసులు కీలక ఆదేశాలు..
Warangal
Follow us
Srikar T

|

Updated on: May 22, 2024 | 2:26 PM

ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేయకూడదు. ఒకవేళ మార్పు చేస్తే వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానికిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు బుధవారం సి. పి. ఓ జంక్షన్ వద్ద అధిక శబ్ధం చేసే ద్విచక్రవాహన సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని రోడ్ రోలర్‎తో ధ్వంసం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనీఖీల్లో నిబంధనలు విరుద్ధంగా.. అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసిన ద్విచక్రవాహనాలను గుర్తించారు. ట్రాఫిక్ పోలీసులు తొలగించిన 261కు పైగా సైలెన్సర్లను మరోమారు వినియోగించకుండా రోడ్ రోలర్ సాయంతో ధ్వంసం చేసారు. ధ్వంసం చేసిన సైలెన్సర్లలో హనుమకొండకు చెందినవి 73 కాగా కాజీపేట 88, వరంగల్‎కు చెందినవి 100 వున్నాయి.

అనంతరం ట్రాఫిక్ ఎసీపీ మాట్లాడుతూ సిపి అదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమని తెలిపారు. అలాగే శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజాఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోని ఈ చర్యలకు పాల్పడినట్లు వివరించారు. అధికంగా శబ్దం చేసే ద్విచక్రవాహనలపై ప్రత్యేక దృష్టి సారించి తనీఖీలు చేపట్టామన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. ఎవరైన సైలెన్సర్ మార్పు చేస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ వాహనదారుడి లైసెన్స్‎ను 3 నెలలపాటు రద్దు చేస్తామని చెప్పారు. ఆ వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే తమ మెకానిక్లులు కూడా ఎట్టి పరిస్థితిలో ద్విచక్రవాహనాలకు సైలెన్సర్ల మార్పుకు ప్రోత్సహించవద్దని సూచించారు. ఇకపైన సైలెన్సర్ల మార్పుకు సహకరించిన మెకానిక్లపై క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…