Medaram: గద్దెల ప్రాంగణానికి తాళాలు వేసి, ధర్నాకు సిద్ధమవుతున్న మేడారం పూజారులు.. ఎందుకో తెలుసా..?
వరంగల్‌లో దేవదాయశాఖ వర్సెస్ మేడారం పూజారులు.. మేడారం పూజారులు, దేవదాయ శాఖ మధ్య వివాదం రాజుకుంది. మేడారం పూజారులు ఆందోళనకు సిద్ధమవుతుండడం హాట్‌టాపిక్‌గా మారింది. వరంగల్‌లోని ధార్మిక భవనం నిర్మించిన స్థల విషయంలో మేడారం పూజారులు, దేవదాయ శాఖ మధ్య వివాదం చెలరేగింది. మేడారం పూజారులు నిరసనలకు పిలుపునివ్వడం చర్చనీయాంశం అవుతోంది.
వరంగల్‌లో దేవదాయశాఖ వర్సెస్ మేడారం పూజారులు.. మేడారం పూజారులు, దేవదాయ శాఖ మధ్య వివాదం రాజుకుంది. మేడారం పూజారులు ఆందోళనకు సిద్ధమవుతుండడం హాట్‌టాపిక్‌గా మారింది. వరంగల్‌లోని ధార్మిక భవనం నిర్మించిన స్థల విషయంలో మేడారం పూజారులు, దేవదాయ శాఖ మధ్య వివాదం చెలరేగింది. మేడారం పూజారులు నిరసనలకు పిలుపునివ్వడం చర్చనీయాంశం అవుతోంది. 1993లో మేడారం జాతర భవిష్యత్తు అవసరాల కోసం వరంగల్‌లోని రంగంపేటలో 1000 గజాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కేటాయించింది.
అయితే.. ఈ స్థలంలో ఏడాది క్రితం భద్రకాళి, మెట్టుగుట్ట, మేడారం జాతర నిధులతో ధార్మిక భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాత.. వివిధ దేవాలయాలకు చెందిన కార్యనిర్వాహక అధికారుల కార్యాలయాలు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే.. ధార్మిక భవనాన్ని, స్థలాన్ని దేవదాయశాఖ పరిధిలోకి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారనే ఆందోళన మేడారం పూజారుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది మేడారం సమ్మక్క సారక్క దేవతలకు కేటాయించిన స్థలం అని.. కావాలంటే.. ప్రభుత్వం నిర్మించిన ధార్మిక భవన్ ఖర్చులను జాతర ఆదాయం నుంచి ఇస్తామని, స్థలంతో పాటు భవనం తమకే అప్పగించాలని మేడారం పూజారులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి.. మంత్రులు, జిల్లా కలెక్టర్, దేవాదాయశాఖ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడంతోనే ఆందోళన బాట పట్టామన్నారు. మే నెల 29, 30వ తేదీల్లో మేడారం గద్దెల ప్రాంగణానికి తాళాలు వేసి, ధర్నా చేస్తామని ప్రకటించారు.
ఇదిలావుంటే.. తాజాగా.. దేవదాయశాఖపై మంత్రి కొండా సురేఖ కీలక సమీక్ష చేశారు. అటు.. దేవదాయశాఖ అధికారులు కూడా వివాదాన్ని చక్కదిద్దేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లాకే చెందిన మంత్రి కొండా సురేఖ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారన్నది హాట్‌టాపిక్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…