Telangana: అయ్యో పాపం.. ఆగి ఉన్న కారు ఆ చిన్నారి ప్రాణాలను మింగేసింది..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు కళ్ళ ముందుకు ఆడుకుంటూ కనిపించిన చిన్నారి అనంతలోకాలకు వెళ్ళింది. కారు డోర్ లాక్ కావడంతో ఉపిరాడక తుదిశ్వాస విడిచింది. మణుగూరు మండలం సాంబాయిగూడెంలో ఈ విషాదం వెలుగు చూసింది. ఆడుకుంటూ వెళ్లి కారెక్కిన మూడేళ్ల చిన్నారి, కార్ డోర్స్ లాక్ అవడంతో మృతి చెందింది.

Car Door Lock
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 22, 2024 | 12:51 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు కళ్ళ ముందుకు ఆడుకుంటూ కనిపించిన చిన్నారి అనంతలోకాలకు వెళ్ళింది. కారు డోర్ లాక్ కావడంతో ఉపిరాడక తుదిశ్వాస విడిచింది. మణుగూరు మండలం సాంబాయిగూడెంలో ఈ విషాదం వెలుగు చూసింది. ఆడుకుంటూ వెళ్లి కారెక్కిన మూడేళ్ల చిన్నారి, కార్ డోర్స్ లాక్ అవడంతో మృతి చెందింది.

కల్నీష అనే మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు నిలిపి ఉంచిన కారులోకి ఎక్కింది. ఈ క్రమంలోనే డోర్స్ లాక్ అవడంతో చిన్నారి కారులోనే చిక్కుకుపోయింది. ఇంటి పక్కన ఆడుకుంటుందేమో అనుకున్న తల్లిదండ్రులు చిన్నారి ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కంగారుపడ్డారు. చుట్టూ పక్కల ప్రాంతాల్లో తల్లిదండ్రులు వెతికారు. అయితే ఫలితం లేకపోయింది. చివరికి ఇంటి ముందు నిలిపి ఉంచిన కారులో కనిపించింది కల్నిషా. వెంటనే కారు డోర్స్ ఓపెన్ చేసి చూడగా అప్పటికే తుదిశ్వాస విడిచింది చిన్నారి.

అల్లారు ముద్దుగా పెంచుకున్న మూడేళ్ళ కూతురు విగతజీవిగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాప ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు సాయి, లిఖితాలను ఓదార్చారు. ఈ ఘటనకు సంబంధించి ప్రమాదవశాత్తూ మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు

పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.

ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది

అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ.. బీదర్‌, పద్మావతీ ఎక్స్‌ప్రెస్

రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.! వాతావరణశాఖ అలెర్ట్..

గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు

కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు ఏం చేశారో తెలుసా.? వీడియో

నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!

34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!

వద్దన్నా అంటగట్టిన టికెట్‌కి రూ.26 లక్షల లాటరీ..!