TS 10th Supply Exams 2024: జూన్‌ 3 నుంచి తెలంగాణ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు.. ఫుల్‌ టైం టేబుల్‌ ఇదే!

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 3వ తేదీ నుంచి జూన్‌ 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈవో సోమశేఖర శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించని వారు రూ.50 ఆలస్య రుసుముతో పరీక్ష తేదీ రెండు రోజుల ముందు వరకు చెల్లించే..

TS 10th Supply Exams 2024: జూన్‌ 3 నుంచి తెలంగాణ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు.. ఫుల్‌ టైం టేబుల్‌ ఇదే!
TS 10th Supply Exams
Follow us
Srilakshmi C

|

Updated on: May 22, 2024 | 12:07 PM

హైదరాబాద్‌, మే 22: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 3వ తేదీ నుంచి జూన్‌ 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈవో సోమశేఖర శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించని వారు రూ.50 ఆలస్య రుసుముతో పరీక్ష తేదీ రెండు రోజుల ముందు వరకు చెల్లించే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు.

తెలంగాణ పదో తరగతి 2024 అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌..

  • జూన్‌ 3వ తేదీన తెలుగు, ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌లో కాంపోజిట్‌ కోర్సు-1, కాంపోజిట్‌ కోర్సు-2 పరీక్షలు
  • జూన్‌ 5వ తేదీన సెకండ్‌ ల్యాంగ్వేజ్‌
  • జూన్‌ 6వ తేదీన ఇంగ్లిష్‌
  • జూన్‌ 7వ తేదీన గణితం
  • జూన్‌ 8వ తేదీన భౌతికశాస్త్రం
  • జూన్‌ 10వ తేదీన జీవశాస్త్రం
  • జూన్‌ 11వ తేదీన సాంఘికశాస్త్రం
  • జూన్‌ 12వ తేదీన ఓఎస్‌ఎస్‌సీ ప్రధాన భాష (సంస్కృతం, అరబిక్‌) పేపర్‌-1
  • జూన్‌ 13వ తేదీన ఓఎస్‌ఎస్‌సీ ప్రధాన భాష (సంస్కృతం, అరబిక్‌) పేపర్‌-2 పరీక్షలు

ఏపీ ఈఏపీసెట్‌ 2024కు తొలిరోజు 94.31 శాతం మంది హాజరు

ఏపీఈఏపీ సెట్‌-2024 పరీక్షలు మే 21న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజు ఈ పరీక్షకు మొత్తం 94.31 శాతం మంది హాజరైనట్లు సెట్‌ ఛైర్మన్ జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు. ఉదయం సెషన్‌లో 29,904 మందికి గానూ 28,087 మంది, మధ్యాహ్నం సెషన్‌లో 30,518 మందికి గానూ 28,895 మంది పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. ఈ లెక్కన మొత్తం 94.31శాతం హాజరయ్యారని ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.