Komatireddy: నేనున్నానంటూ భరోసా..! వీధిన పడిన కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆపన్న హస్తం
పేదల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుంటారు. అభాగ్యలకు ఆర్థికంగా చేయూతనిచ్చి ఆపన్న హస్తం అందిస్తుంటారు. తండ్రిని కోల్పోయిన చిన్నారులకు అండగా ఉంటానంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరొకసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.
పేదల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుంటారు. అభాగ్యలకు ఆర్థికంగా చేయూతనిచ్చి ఆపన్న హస్తం అందిస్తుంటారు. తండ్రిని కోల్పోయిన చిన్నారులకు అండగా ఉంటానంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరొకసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.
యాదాద్రి జిల్లా మోత్కూరు: మండలం ఆరెగూడెంకు చెందిన దేవర శ్రీశైలం కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దేవర శ్రీశైలం ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో శ్రీశైలం కుటుంబం వీధిన పడింది. ముగ్గురు చిన్నారులతో శ్రీశైలం భార్య మమత భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. ఆపన్న హస్తం కోసం ఆమె చేయి చాచినా.. ఎవరూ కనికరించలేదు. శ్రీశైలం భార్య మమత తన పిల్లలతో కలిసి సాయం కోసం స్థానిక ఎమ్మెల్యే మందుల సామ్యేల్ తో కలిసి హైదరాబాద్ లోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నివాసానికి వెళ్లింది.
శ్రీశైలం కుటుంబ పరిస్థితి తెలుసుకుని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చలించి పోయారు. చిన్నారులను ఎత్తుకొని ఓదార్చారు. ఈ కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ముగ్గురు పిల్లలు సాక్షిత, అంజలి, అజయ్ కుమార్ లను తానే చదివిస్తానని, వారు ప్రయోజకులయ్యే వరకు తాను అండగా ఉంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. మృతుడు శ్రీశైలం భార్య మమత కుటుంబ పోషణకు రూ. లక్షన్నర ఆర్థిక సహాయాన్ని కోమటిరెడ్డి అందజేశారు. ఏ కష్టం వచ్చినా తనను సంప్రదించాలని మమతకు మంత్రి చెప్పారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి మమత కృతజ్ఞతలు తెలిపారు. వీధిన పడిన కుటుంబానికి అండగా ఉన్నందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్థానిక కాంగ్రెస్ నేతలు ధన్యవాదాలు తెలిపారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..