CM KCR AND VIJAY: సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌.. రాజకీయ చర్చకు దారి తీసిన భేటీ!

CM KCR AND VIJAY: ఇది మర్యాదపూర్వక భేటీనే అని చెబుతున్నా వీరిద్దరూ కలిసి సమావేశం కావడం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. ఎందుకంటే తమిళనాట విజయ్‌కు మాస్‌ ఫాలోయింగ్ ఉంది. ఫాలోయింగ్‌తోనే పరోక్షంగా రాజకీయాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాడు

CM KCR AND VIJAY: సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌.. రాజకీయ చర్చకు దారి తీసిన భేటీ!
Cm Kcr And Vijay
Follow us
Basha Shek

|

Updated on: May 18, 2022 | 8:16 PM

CM KCR AND VIJAY:  కోలీవుడ్ స్టార్‌ నటుడు విజయ్‌ దళపతి (Vijay Thalapathy), తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావును కలిశారు. బుధవారం సాయంత్రం ప్రగతి భవన్‌కి వెళ్లి మరీ సీఎం కేసీఆర్‌ను కలిశారు విజయ్‌. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ విజయ్‌ను సన్మానించారు. అనంతరం కాసేపు ముచ్చటించుకున్నారు. కాగా ఇది మర్యాదపూర్వక భేటీనే అని చెబుతున్నా వీరిద్దరూ కలిసి సమావేశం కావడం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. ఎందుకంటే తమిళనాట విజయ్‌కు మాస్‌ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్‌తోనే పరోక్షంగా రాజకీయాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా కేసీఆర్‌ తరహాలోనే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడీ కోలీవుడ్ స్టార్‌. అప్పుడప్పుడు విజయ్ వ్యవహరిస్తోన్న తీరు కూడా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటోంది.

ఇటీవల తమిళనాట స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ గుడ్‌విలే సింబల్‌గా పోటీచేసిన అభిమానులు 128 పంచాయతీల్లో గెలుపొందడం గమనార్హం. ఈక్రమంలోనే రాబోయే సార్వత్రిక ఎలక్షన్లలో విజయ్ కీలకం అవుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇన్నిరకాల అంశాల నేపథ్యంలో కేసీఆర్‌తో విజయ్‌ భేటీపై అనేక చర్చలు మొదలయ్యాయి. జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తుల ఏకీకరణ ప్రయత్నంలో భాగమా అనే ఆసక్తికర చర్చ మొదలైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read: 

Rajeev Chandrasekhar: సైబర్‌ సెక్యూరిటీ విషయంలో వెనక్కు తగ్గేదేలే.. త్వరలోనే డేటా ప్రొటెక్షన్‌ బిల్లు అమల్లోకి : కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

Viral Video: వామ్మో! బంగారాన్ని ఇలా కూడా దొంగలిస్తారా? ఈ కి’లేడీ’ ఐడియాను చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?