Telangana: మందుబాబులకు షాక్.. మద్యం ధరలు పెంచుతూ తెలంగాణ సర్కార్ నిర్ణయం

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన మద్యం ధరలు ఈ నెల 19 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Telangana: మందుబాబులకు షాక్.. మద్యం ధరలు పెంచుతూ తెలంగాణ సర్కార్ నిర్ణయం
Telangana Liquor
Follow us
Ram Naramaneni

|

Updated on: May 18, 2022 | 9:33 PM

Liquor prices hike: తెలంగాణలోని  మందుబాబులకు షాకింగ్ న్యూస్ ఇది. అవును… రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన మద్యం ధరలు ఈ నెల 19 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మద్యం దుకాణాల్లో బుధవారం అమ్మకాలు పూర్తి కాగానే మద్యం సీజ్‌ చేయనున్నారు అధికారులు.  ఆపై నిల్వలు లెక్కించి గురువారం(ఏప్రిల్19) నుంచి పెరిగిన ధరల ప్రకారం విక్రయించేలా చర్యలు తీసుకోనున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఒక్కో బీరుపై 20 రూపాయలు పెంచుతున్నట్లు తెలుస్తోంది. మద్యం క్వార్టర్‌పై 20 రూపాయలు పెంచనున్నారు. ఈ లెక్కన ఫుల్ బాటిల్‌పై 80 రూపాయలు పెరగనుంది. అయితే ఎంత మేర ధరలు పెరిగాయనే వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.