Rajeev Chandrasekhar: సైబర్‌ సెక్యూరిటీ విషయంలో వెనక్కు తగ్గేదేలే.. త్వరలోనే డేటా ప్రొటెక్షన్‌ బిల్లు అమల్లోకి : కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

భారతదేశంలో విశ్వసనీయమైన, సురక్షితమైన ఇంటర్నెట్‌ను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Rajeev Chandrasekhar: సైబర్‌ సెక్యూరిటీ విషయంలో వెనక్కు తగ్గేదేలే.. త్వరలోనే డేటా ప్రొటెక్షన్‌ బిల్లు అమల్లోకి : కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
Rajeev Chandrasekhar
Follow us
Basha Shek

|

Updated on: May 18, 2022 | 6:58 PM

సైబర్‌ సెక్యూరిటీ విషయంలో వెనక్కు తగ్గేది లేదని, ఇంటర్నెట్‌ యూజర్ల వ్యక్తిగత గోప్యతను కాపాడడమే లక్ష్యంగా త్వరలోనే డేటా ప్రొటెక్షన్‌ బిల్లును అమల్లోకి తెస్తామని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(Rajeev Chandrasekhar) తెలిపారు. భారతదేశంలో విశ్వసనీయమైన, సురక్షితమైన ఇంటర్నెట్‌ను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్కిల్స్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ బుధవారం (మే18) విలేకరుల సమావేశం నిర్వహించింది. దీనికి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT), స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) జారీ చేసిన సైబర్ సెక్యూరిటీ ఆదేశాలపై తరచుగా అడిగే ప్రశ్నల (FAQలు) పత్రాన్ని కేంద్ర మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ..సైబర్ సెక్యూరిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా క్లిష్టమైన సమస్యగా మారిందన్నారు. కాబట్టి మనం ఇంటర్నెట్ సురక్షితంగా ఉండేలా చూసుకోలని సూచించారు.

180 రోజుల డేటాబేస్ ను..

ఇవి కూడా చదవండి

‘డిజిటల్ ఎకానమీ పెరుగుతున్న కొద్దీ అవకాశాలు పెరుగుతాయి. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అలాగే మౌలిక సదుపాయాల కోసం 2019-20లో 809 కోట్లు, 2022-23లో 550 కోట్లు ఖర్చు చేసింది. ఇక సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించేందుకు రూ.100 కోట్లు వెచ్చించాం. ఇప్పటివరకు 1,360 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని.. 2,50,000 మంది ఈ అవగామన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారతదేశంలో విశ్వసనీయమైన, సురక్షితమైన ఇంటర్నెట్‌ను అందించడమే మా లక్ష్యం. ఈ-కామర్స్‌ కంపెనీలు, బ్యాంకులు తదితర సంస్థలు కూడా ఇంటర్నెట్‌ విషయంలో వినియోగదారులకు భరోసా ఇవ్వాలి. వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరించకూడదు. ఇంటర్నెట్‌ వినియోగానికి సంబంధించిన రూల్స్ అన్నీ ఇండస్ట్రీల వారితో చర్చించి తయారు చేశామని, వాటిని పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఏవైనా సైబర్ నేరాలు జరిగినా 6 గంటల్లోగా రిపోర్టు చేయాలి. అన్ని కంపెనీలు తమ డేటాబేస్‌ను 180 రోజుల పాటు సురక్షితంగా ఉంచుకోవాలి. ఈ నిబంధనలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయి. ‘

త్వరలోనే డేటా రక్షణ బిల్లు.. ‘వ్యక్తిగత వినియోగదారుల గోప్యతను రక్షించే లక్ష్యంతో త్వరలోనే డేటా ప్రొటెక్షన్‌ బిల్లును అమల్లోకి తెస్తున్నాం. దీని ప్రకారం ఎక్కడెక్కడ సైబర్ భద్రతా ఉల్లంఘనలు జరుగుతున్నాయో సమీక్షిస్తాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. డేటా రక్షణ చట్టం పౌరుల హక్కులతో పాటు గోప్యతను కాపాడుతుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇలాంటి మరిన్ని నియమాలు, మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. వాటిని పాటించేందుకు 60 రోజుల సమయం ఇచ్చాం. 2011- 2022 మధ్య చాలా వ్యత్యాసం ఉంది . ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. ఆ మేరకు ఐటీ చట్టంలో కూడా మార్పులు తీసుకొస్తాం’ అని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Viral Video: వామ్మో! బంగారాన్ని ఇలా కూడా దొంగలిస్తారా? ఈ కి’లేడీ’ ఐడియాను చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..

Dental Health: దంతాలు మెరవాలంటే వీటిని దూరం పెట్టాల్సిందే.. లిస్టులో టీ, కాఫీలతో పాటు..

Suriya: జైభీమ్‌ సినిమాను వెంటాడుతోన్న వివాదాలు.. సూర్య దంపతులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు..

బన్నీని ఉద్దేశించే మెగా ప్రిన్స్ ఆ మాటలు అన్నారా? వరుణ్ కామెంట్స్
బన్నీని ఉద్దేశించే మెగా ప్రిన్స్ ఆ మాటలు అన్నారా? వరుణ్ కామెంట్స్
వీళ్ల పైత్యం పాడుగాను.. ఆడవాళ్లను అంగడి బొమ్మలుగా మార్చి బిజినెస్
వీళ్ల పైత్యం పాడుగాను.. ఆడవాళ్లను అంగడి బొమ్మలుగా మార్చి బిజినెస్
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం