AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode Bypoll: మునుగోడులో విజేతను తేల్చేది వీరే.. సామాజిక వర్గాలవారిగా ఓ లెక్క..

కులాల లెక్కలేసుకుని మరీ రాజకీయాలు చేస్తుంటాయి పార్టీలు. మునుగోడు ఫైట్ మొదలైంది. మూడు పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టాయి. ఇప్పుడు ఏ కులం వారు ఎటు..? ఎవరి జనాభ ఎంత..? దీనికి ఓ లెక్కుంది..

Munugode Bypoll: మునుగోడులో విజేతను తేల్చేది వీరే.. సామాజిక వర్గాలవారిగా ఓ లెక్క..
Munugode
Sanjay Kasula
|

Updated on: Aug 04, 2022 | 5:39 PM

Share

మునుగోడు(Munugode) రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో మూడు పార్టీలు బై పోల్‌పై స్పెషల్ ఫోకస్‌ పెట్టాయి. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నాయి. ఇదిలావుంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలో జరిగిన పొరపాటు రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతోంది. నియోజకవర్గంలో విస్తృత ప్రచారం తర్వాతే అభ్యర్థిని ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తోంది. పార్టీ అభ్యర్థులు దీటైన వారు కాకపోవడంతోనే దుబ్బాక, హుజూరాబాద్‌లో ఓడిపోయినట్లు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మునుగోడు క్యాండేట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

బీజేపీ మినహా రెండు పార్టీలు టికెట్‌ ఆశిస్తున్నవారిపై సర్వేలు నిర్వహిస్తోంది. సామాజిక, ఆర్ధిక, ఇతర అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. పార్టీ ప్రాబల్యానికి తోడు అభ్యర్థి అదనపు బలం కావాలని ఆశిస్తున్నాయి. అయితే సర్వేల్లో తమకు అనుకూలంగా రిపోర్ట్ వస్తే టికెట్‌ ఇవ్వాలని చూస్తున్నాయి.

అయితే పలు కీలక అంశాలను అన్ని పార్టీలు భేరీజు వేస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో  ఏ సామాజిక వర్గం వారు అధికంగా ఉన్నారు..? ఏ కులస్తుల ఓట్లు ప్రభావం చూస్తాయి..? బీసీల ఓట్లు ఎన్ని..? ఎస్సీ, ఎస్టీ ఓట్లు ఎలా ఉన్నాయనే అంశంపై చర్చ జరుగుతున్నాయి. ఇదే అంశంపై ఆ నియోజకవర్గంలో వివరాలు ఇలా ఉన్నాయి..

మొత్తం ఓటర్లు -2,20,520.. మునుగోడులో కులాల వారీగా ఓట్లు ఇలా..

1. గౌడలు-35,150 (15.94 శాతం)

2. ముదిరాజ్ లు-33,900 (15.37 శాతం)

3. ఎస్సీ మాదిగ-25,650 (11.63 శాతం)

4. యాదవ-21360 (9.69 శాతం)

5. పద్మశాలీ-11,680 (5.30 శాతం)

6. ఎస్టీ లంబాడీ-ఎరుకల-10,520 (4.77 శాతం)

7. ఎస్సీ మాల-10,350 (4.69 శాతం)

8. వడ్డెర-8350 (3.79 శాతం)

9. కుమ్మరి-7850 (3.56 శాతం)

10. విశ్వ బ్రాహ్మణ-7,820 (3.55 శాతం)

11. రెడ్డి-7,690(3.49 శాతం)

12. ముస్లింలు-7,650 (3.47 శాతం)

13. కమ్మ-5,680(2.58 శాతం)

14. ఆర్యవైశ్య-3,760 (1.71 శాతం)

15. వెలమ-2,360 (1.07 శాతం)

16. మున్నూరు కాపు-2,350(1.07శాతం)

17. ఇతరులు-18,400( 8.34 శాతం)

మొత్తానికి సామాజిక వర్గాల సమీకరణాలు, ఇతర పార్టీల అభ్యర్థులను పరిశీలించిన తర్వాతే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్‌, టీఆర్ఎస్ ఆలోచనగా తెలుస్తోంది. సర్వేలు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తామని రెండు పార్టీల హైకమాండ్‌లు చెబుతోంది. మొత్తానికి ఇలా కులాలవారీగా ఎంత లాభం చేకూరుతుందో పక్కాగా లెక్కలు వేసుకొని మరీ స్ట్రాటజీని అమలు చేస్తున్నారట అన్ని పార్టీల పెద్దలు. కులలవారిగా వచ్చే సమరానికి సిద్ధమవుతున్నాయి.. ఏ మేరకు సత్ఫలితాలు సాధిస్తుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us