Hyderabad: యూనిఫాం వేసుకుంటే బూతులు మాట్లాడమని.. చెంపలు వాయించమని కొత్త రూల్స్‌ పెట్టారా..?

యూనిఫాం వేసుకుంటే భూతులు తిట్టొచ్చా..? చెంపలు వాయించవచ్చా..? ఓ ఇద్దరు హైదరాబాద్ పోలీసుల ఓవరాక్షన్ అలానే ఉంది. అంత పద్ధతిగా వేడుకుంటున్నా.. కనీసం మానవత్వం కూడా లేకుండా..?

Hyderabad: యూనిఫాం వేసుకుంటే బూతులు మాట్లాడమని.. చెంపలు వాయించమని కొత్త రూల్స్‌ పెట్టారా..?
Cops Slaps People
Follow us

|

Updated on: Aug 04, 2022 | 6:27 PM

Telangana: నగరంలో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోయారు. వాహనాలపై చలాన్లు వాయించడమే కాకుండా.. ఫైన్లు చెల్లించాలంటూ వాహనదారుల చెంపలు కూడా వాయించారు. సైబరాబాద్‌(Cyberabad)లో ఇద్దరు ట్రాఫిక్‌ పోలీసుల ప్రవర్తన నగరం ఇప్పుడు హాట్‌ టాఫిక్‌గా మారింది. రాత్రి మియాపూర్‌(miyapur) ప్రాంతంతో అధికారులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో ట్రాఫిక్‌ సీఐ అతిగా ప్రవర్తించారు. చేతిలో అధికారం ఉందని ఓ వాహనదారుడిపై చేయిచేసుకున్నారు ట్రాఫిక్‌ సీఐ సుమన్‌. అతడిని తిట్టుకుంటూ కాలర్‌ పట్టుకొని లాక్కెళ్లి మరీ కొట్టాడు. అయితే ట్రాఫిక్‌ అధికారులకు కొట్టే అధికారం లేదని తప్పు చేస్తే కేసు నమోదు చేయాలని బాధితుడు చెపుతున్నా వినకుండా.. నాకే ఎదురు చెపుతావా..? అంటూ సీఐ ఇంకా రెచ్చిపోయాడు.

అటు కేపీహెచ్‌బీలోనూ ఓ వ్యక్తిపై ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ చేయిచేసుకున్నారు. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని కైత్లాపూర్‌ వద్ద కూకట్‌పల్లి ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. వాహనంపై పెండింగ్‌ చలాన్లు ఉన్నాయని, వెంటనే డబ్బులు చెల్లించాలని తెలిపారు. అయితే ప్రస్తుతం తనవద్ద డబ్బులు లేవని, అత్యవసర పని మీద వెళ్తున్నానని, రేపు చెల్లిస్తానని కోరాడు. అయినా ఒప్పుకోని ట్రాఫిక్‌ సీఐ కిరణ్‌ అతడిని దుర్భాషలాడుతూ చేయిచేసుకున్నారు. సార్ గారి నోటి నుంచి పెద్ద పెద్ద బూతులే వచ్చాయి. ఒంటిపై యూనిఫాం ఉంది కాబట్టి.. తాను పైలోకం నుంచి దిగి వచ్చినట్టు కలరింగ్ ఇచ్చాడు సార్.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదేనా అంటూ మండిపడుతున్నారు స్తానికులు. అధికారం చేతిలో ఉందని ఇలా రెచ్చిపోతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ ఇద్దరు ట్రాఫిక్‌ పోలీసుల తీరు నగరంలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. వారిపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు బాధితులు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో