Telangana: ఆ కళాశాలలో మళ్లీ ర్యాగింగ్.. చివరికి ఏడుగురు సీనియర్లు సస్పెండ్

ర్యాగింగ్ అనే భూతం ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వెంటాడుతూనే ఉంది. అయితే తాజాగా వరంగల్‎లోని కాకతీయ మెడికల్ కాలేజీలో జూనియర్ విద్యార్థి పై ర్యాంగింగ్ కు పాల్పడి పైశాచికానందం పొందిన ఏడుగురు సీనియర్ విద్యార్థులపై వేటు పడింది. వారిపై మట్వాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఆరు గంటల పాటు కీలక సమావేశం నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ కమిటీ వారిపై ఎట్టకేలకు వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సంఘటన 14వ తేదీన జరిగింది.

Telangana: ఆ కళాశాలలో మళ్లీ ర్యాగింగ్.. చివరికి ఏడుగురు సీనియర్లు సస్పెండ్
Ragging
Follow us
G Peddeesh Kumar

| Edited By: Aravind B

Updated on: Sep 19, 2023 | 8:30 PM

ర్యాగింగ్ అనే భూతం ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వెంటాడుతూనే ఉంది. అయితే తాజాగా వరంగల్‎లోని కాకతీయ మెడికల్ కాలేజీలో జూనియర్ విద్యార్థి పై ర్యాంగింగ్ కు పాల్పడి పైశాచికానందం పొందిన ఏడుగురు సీనియర్ విద్యార్థులపై వేటు పడింది. వారిపై మట్వాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఆరు గంటల పాటు కీలక సమావేశం నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ కమిటీ వారిపై ఎట్టకేలకు వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సంఘటన 14వ తేదీన జరిగింది. మనోహర్ అనే ఎంబీబీఎస్ సెకండ్ ఈయర్ విద్యార్థిపై పది మంది సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. హాస్టల్ గదిలోకి తీసుకెళ్ళి విచక్షణా రహితంగా కొట్టారు. ఓ సీనియర్ విద్యార్థి బర్త్‌డే వేడుకల అనంతరం ఈ ఘటన జరిగడం కలకలం రేపింది. ఇక తీవ్ర గాయాల పాలైన మనోహర్‎ను వెంటనే ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు.

అయితే తనపై దాడి చేసిన వారిపై మనోహర్ మట్వాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో యూజీసీ కూడా ఫిర్యాదు చేశాడు. తనను పదిమందికి పైగా సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసి విచక్షణారహితంగా కొట్టారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడుయ. బాధిత విద్యార్థి ఫిర్యాదు మేరకు మత్వాడ పోలీస్ స్టేషన్లో ఏడుగురు మెడికోలపై కేసు నమోదు చేశారు. అయితే ప్రాథమిక విచారణలో ర్యాగింగ్ జరిగిందని గుర్తించారు. జూనియర్ విద్యార్థిని ఉద్దేశపూర్వకంగానే హాస్టల్ గదిలోకి తీసుకెళ్లి ర్యాగింగ్ చేయడంతో పాటు విచక్షణారకంగా కొట్టారని నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ క్రమంలోనే కేఎంసి ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ నేతృత్వంలో ఈరోజు యాంటీ ర్యాగింగ్ కమిటీ కీలక భేటీ జరిగింది.

మొత్తం 13 మంది సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో సీనియర్ జూనియర్ విద్యార్థులను విచారించారు బాధ్యత విద్యార్థి తల్లిదండ్రులకు కూడా విచారించారు. 6 గంటల పాటు చర్చించిన అనంతరం యాంటీ ర్యాగింగ్ కమిటీ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంది. ర్యాగింగ్ జరిగిందని నిర్ధారణకు వచ్చిన ఈ కమిటీ ర్యాగింగ్ కు పాల్పడిన ఏడుగురు విద్యార్థులను మూడు నెలల పాటు అకాడమిక్ నుండి సస్పండ్ చేయడంతో పాటు సంవత్సరం పాటు హాస్టల్ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ తెలిపారు. అంతేకాదు ఈ ఘటనలో పాల్గొన్న మరో 20 మంది విద్యార్థులకు నోటీసులు అందించారు. పోలీసుల విచారణ కొనసాగుతుందని.. అయితే ఈ విచారణలో వారి పాత్ర నిర్దారణ అయితే వారిపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..