మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో రకరకాల వినాయక మండపాలు కట్టిపడేస్తున్నాయి. ఒక చోట చంద్రయాన్ విజయాన్ని కీర్తిస్తూ, మరోచోట భక్తి భావాన్ని పెంపొందిస్తు ఏర్పాటు చేసిన లంబోదరుడి విగ్రహాలు, మండపాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా వీర శివాజీ నగర్ లో ఏర్పాటుచేసిన చంద్రయాన్ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు.