DK Aruna: కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కాదు.. మూడు హామీలు ఇవ్వాలి: డీకే అరుణ

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ, అలాగే దాని మిత్రపక్షాలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ఆమె ఆరోపణలు చేశారు. ఇక దేశంలో వైషమ్యాలు సృష్టించి అభివృద్ధికి ఆటంకాలు కల్పించడం సరైందేనా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

DK Aruna: కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కాదు.. మూడు హామీలు ఇవ్వాలి: డీకే అరుణ
Dk Aruna
Follow us
Aravind B

|

Updated on: Sep 19, 2023 | 4:33 PM

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ, అలాగే దాని మిత్రపక్షాలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ఆమె ఆరోపణలు చేశారు. ఇక దేశంలో వైషమ్యాలు సృష్టించి అభివృద్ధికి ఆటంకాలు కల్పించడం సరైందేనా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక వివారాల్లోకి వెళ్తే నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీకే అరుణ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తమ విశ్వాసం కోల్పోయిందని.. అలాగే మత విద్వేషాలతో బీజేపీని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు ఆమె ఆరోపణలు చేశారు.

అలాగే ఇప్పుడు ఆరు గ్యారంటీలు అనే పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తోందని డీకే అరుణ ఆరోపణలు చేశారు. అయితే అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో 4వేల రూపాయల పింఛన్‌ ఇస్తున్నారా అలాగే.. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ పథకాలను అమలు చేస్తున్నారా అంటూ ప్రశ్నలు సంధించారు డీకే అరుణ. ప్రస్తుతం కర్ణాటకలో ఆర్టీసీ పరిస్థితి చాలా అధ్వానంగా తయారైనట్లు పేర్కొన్నారు. అలాగే ఆ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీకి సవాలు చేశారు. అసలు కాంగ్రెస్‌ పార్టీ ముందు మూడు గ్యారంటీలు ఇవ్వాలని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారరని, కుంభకోణాలు చేయమని, తెలంగాణ చరిత్రను తప్పుదారి పట్టించబోమని గ్యారంటీ హామీలు ఇవ్వాలని సవాలు విసిరారు.

అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా విమర్శించారు డీకే అరుణ. మహిళలను గౌరవించే అలవాటు ఆయనకు లేదని పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ కమిటీల్లో ఎక్కడైనా మహిళలకు కీలక బాధ్యత ఉందా అని ప్రశ్నించారు. అలాగే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో నా శ్రమ కూడా ఉందని వ్యాఖ్యానించారు. అలాగే ఈ ప్రాజెక్టు కోసం కృషి చేసినటువంటి నన్ను గౌరవించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్ పార్టీలు తోడు దొంగలని ఎద్దేవా చేశారు. బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. ఈ ఏడాది చివరికి జరుగుతాయా లేదా ఆలస్యమవుతందా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!