Women’s Reservation Bill 2023: మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీకి రాహుల్ లేఖ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన లెటర్
ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించింది. సోమవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. కేబినెట్ నిర్ణయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఈ విషయమై 6 ఏళ్ల క్రితం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కాంగ్రెస్ నేత జైరాం నరేష్ అందుకు సంబంధించిన లెటర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ..
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించింది. సోమవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. కేబినెట్ నిర్ణయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఈ విషయమై 6 ఏళ్ల క్రితం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కాంగ్రెస్ నేత జైరాం నరేష్ అందుకు సంబంధించిన లెటర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
యూపీఏ ప్రభుత్వం 2008లో మహిళా రిజర్వేషన్ బిల్లును రూపొందించింది. కానీ రాజ్యసభలో ఆమోదం పొందేందుకు రెండేళ్లు పట్టింది. బీజేపీ మద్దతుతో ఎగువసభలో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందినప్పటికీ చట్ట రూపం దాల్చలేదు. అయితే ఈ బిల్లు విషయంలో బీజేపీకి కాంగ్రెస్ ఎప్పుడూ మద్దతిస్తూనే వచ్చింది. అయితే దేశంలోని మరికొన్ని కీలక రాజకీయ పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. మహిళా రిజర్వేషన్లలో వెనుకబడిన తరగతులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలనేది ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి 2018 జూలై 16న ఎన్డీయే హయాంలో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇంతకీ ఆ లెటర్‌లో ఏం ఉందంటే..
రాహుల్ లేఖలో.. ‘మహిళా సాధికారతకు తాను అనుకూలంగా ఉన్నానని మన ప్రధాని చెబుతున్నారు. రాజకీయాలకు అతీతంగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ బేషరతుగా మీకు మద్దతు ఇస్తోందని లేఖలో పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం మనం ఐక్యంగా పోరాడదామని ప్రధాని మోదీకి రాహుల్ సందేశం ఇచ్చారు. యూపీఏ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదం పొందుతుందనే విషయాన్ని కూడా రాహుల్ గాంధీ లేఖలో ప్రస్తావించారు. అప్పటి ప్రతిపక్ష నేత, దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఈ బిల్లును చారిత్రకమైన బిల్లుగా పేర్కొన్నారు.
Our PM says he’s a crusader for women’s empowerment? Time for him to rise above party politics, walk-his-talk & have the Women’s Reservation Bill passed by Parliament. The Congress offers him its unconditional support.
Attached is my letter to the PM. #MahilaAakrosh pic.twitter.com/IretXFFvvK
— Rahul Gandhi (@RahulGandhi) July 16, 2018
యాదృచ్ఛికంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల మొదటి రోజు అనేక పార్టీలు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని ఒత్తిడి చేశాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తారు. ఆ తర్వాత సోమవారం (సెప్టెంబర్ 18) ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. మహిళలకు 33 శాతం లేదా మూడింట ఒక వంతు రిజర్వ్ చేయాలనే ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లు ప్రకాంర షెడ్యూల్డ్ కులాలు, తెగలతోపాటు ఆంగ్లో-ఇండియన్లకు కూడా రిజర్వేషన్లను అందిస్తుంది. అయితే ఇది శాశ్వతం కాదు. ప్రతి లోక్‌సభ ఎన్నికల తర్వాత రిజర్వ్‌డ్ సీట్లను మార్చాలని కూడా బిల్లులో పేర్కొన్నారు. విశ్వాస వర్గాల సమాచారం మేరకు మహిళా రిజర్వేషన్ బిల్లును సెప్టెంబర్ 20 (బుధవారం) జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.