Chandrababu Arrest: ఢిల్లీలో లోకేష్ పోరాటం.. చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ.. ఇవాళ ఏం జరగనుంది..
Chandrababu Naidu Arrest: అటు ఢిల్లీలో లోకేష్ పోరాటం.. ఇటు అమరావతిలో కీలక పిటిషన్లపై విచారణ. చంద్రబాబు ఇష్యూలో టీడీపీకి ఇది బిగ్ డే. తమ అధినేత చంద్రబాబుకు రిలీఫ్ వస్తుందా లేదా అన్నదానిపై నేతలు, కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఈరోజు ఏం జరగబోతోందన్నది ఉత్కంఠగా మారింది. స్కిల్ డవలప్‌మెంట్ స్కామ్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ నారా లోకేష్ తో పాటు టీడీపీ ఎంపీలు, నేతలు ఢిల్లీలో నిరసనకు దిగారు.
Chandrababu Naidu Arrest: ఢిల్లీలో లోకేష్ పోరాటం.. ఇటు అమరావతిలో కీలక పిటిషన్లపై విచారణ.. చంద్రబాబు ఇష్యూలో టీడీపీకి ఇది బిగ్ డే. తమ అధినేత చంద్రబాబుకు రిలీఫ్ వస్తుందా లేదా అన్నదానిపై నేతలు, కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఈరోజు ఏం జరగబోతోందన్నది ఉత్కంఠగా మారింది. స్కిల్ డవలప్‌మెంట్ స్కామ్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ నారా లోకేష్ తో పాటు టీడీపీ ఎంపీలు, నేతలు ఢిల్లీలో నిరసనకు దిగారు. రాజ్‌ఘాట్‌లో మహాత్మగాంధీ సమాధి దగ్గర నివాళులు అర్పించారు. అనంతరం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ మౌనదీక్ష చేశారు. నిన్న పార్లమెంట్, మొన్న అఖిలపక్షం సమావేశంలోను చంద్రబాబు అరెస్ట్‌ను ప్రస్తావించారు టీడీపీ ఎంపీలు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ సైతం కౌంటర్ ఇచ్చారు. నారా లోకేష్ సైతం గత నాలుగు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. లీగల్ పరంగా పలువురు న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు. న్యాయస్థానంలో ఈ రోజు తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు.
ఇదిలాఉంటే.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు తరపున ముగ్గురు, ప్రభుత్వం తరపున ముగ్గురు లాయర్లు వాదించనున్నారు. ఇప్పటికే జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు. చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సమయం ఇచ్చింది. దీంతో గత శుక్రవారమే క్వాష్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసింది సీఐడీ. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది.
I paid my respects to Mahatma Gandhi Ji at Rajghat in New Delhi, accompanied by senior party leaders. We joined in a black badge protest to condemn the unjust arrest of @ncbn Garu on false charges filed by the YSRCP Government. Justice will prevail.#APvsJagan#IAmWithBabu… pic.twitter.com/ziii6jOq7n
— Lokesh Nara (@naralokesh) September 19, 2023
ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పైనా వాదనలు కొనసాగనున్నాయి. హైకోర్టు నిర్ణయం తర్వాతే ఏసీబీ కోర్టులో విచారణ చేపట్టే అవకాశం ఉంది. మొత్తం నాలుగు పిటిషన్లపై విచారణ జరగనుంది. రిమాండ్ సస్పెండ్ చేయాలని చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ పిటిషన్, చంద్రబాబును ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటీషన్, అవుటర్ రింగ్‌రోడ్, అంగల్లు ఘర్షణ, విజయనగరం కేసులపై చంద్రబాబు తరపున వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరనుంది.
చంద్రబాబు తరుపున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ల సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్, లండన్ లాయర్ హరీష్ సాల్వే వాదనలు వినిపించనున్నారు. CID తరపున మాజీ అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గి, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. మధ్యాహ్నం నాటికి ఈ పిటీషన్లపై క్లారిటీ రానుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..