తీరం వెంబడి గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండటం వల్ల మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచిస్తోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.