AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

24 అంతస్తుల భవనం పైనుంచి పడి ఇంటర్‌ విద్యార్థి మృతి..! తండ్రి దుబాయ్‌లో ప్రొఫెసర్‌, తల్లి లాయర్‌..

ప్రణవ్‌ తండ్రి డాక్టర్ అమన్ శ్రీవాస్తవ IMT దుబాయ్‌లో ప్రొఫెసర్. తల్లి న్యాయవాది. వాస్తవానికి వీళ్లు గోరఖ్‌పూర్ నివాసితులుగా తెలిసింది. అయితే ప్రాథమిక విచారణలో ఆత్మహత్యగా తేలిందని పోలీసులు చెబుతున్నారు. మిగిలిన అంశాలపై విచారణ జరుపుతున్నారు. 24వ అంతస్తు నుంచి ఏ సమయంలో పడిపోయాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు చెప్పారు. 24వ అంతస్తు నుంచి పడి ప్రణవ్

24 అంతస్తుల భవనం పైనుంచి పడి ఇంటర్‌ విద్యార్థి మృతి..! తండ్రి దుబాయ్‌లో ప్రొఫెసర్‌, తల్లి లాయర్‌..
Greater Noida Building
Jyothi Gadda
|

Updated on: Sep 19, 2023 | 2:20 PM

Share

24 అంతస్తుల భవనం పై నుండి పడి ఇంటర్ విద్యార్థి మృతిచెందిన విషాద సంఘటన ఉత్తప్రదేశ్ నోయిడాలో చోటు చేసుకుంది.  గ్రేటర్ నోయిడాలోని బిస్రఖ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో అత్యంత ఎత్తైన భవనం 24వ అంతస్తు నుంచి పడి మృతి చెందాడు. గౌర్ సౌందర్య హౌసింగ్ సొసైటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి పేరు ప్రణవ్. ప్రాథమిక విచారణలో ప్రణవ్‌ది ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో పోలీసులకు ఈ విషయంపై సమాచారం అందింది. సొసైటీ సూపర్‌వైజర్‌ పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడివున్న ప్రణవ్‌ మృతదేన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతడు అతను తన తల్లి, సోదరితో కలిసి ఉంటున్నట్టుగా తెలిసింది.

అయితే, ప్రణవ్‌ తండ్రి డాక్టర్ అమన్ శ్రీవాస్తవ IMT దుబాయ్‌లో ప్రొఫెసర్. తల్లి న్యాయవాది. వాస్తవానికి వీళ్లు గోరఖ్‌పూర్ నివాసితులుగా తెలిసింది. అయితే ప్రాథమిక విచారణలో ఆత్మహత్యగా తేలిందని పోలీసులు చెబుతున్నారు. మిగిలిన అంశాలపై విచారణ జరుపుతున్నారు. 24వ అంతస్తు నుంచి ఏ సమయంలో పడిపోయాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు చెప్పారు. 24వ అంతస్తు నుంచి పడి ప్రణవ్ మృతి చెందినట్లు బిస్రఖ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అనిల్ రాజ్‌పుత్ తెలిపారు. మృతుడి మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతని కుటుంబ సభ్యులు కూడా ఘటనా స్థలంలోనే ఉన్నారని చెప్పారు. అయితే, ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఫిర్యాదు అందితే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రాథమిక విచారణలో ఆత్మహత్యగా తెలుస్తోందన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత అంతా తేలనుందని చెప్పారు.. అయితే పోలీసులు ప్రతి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రణవ్ రాత్రుళ్లు తన స్నేహితులను కలిసేందుకు తరచు బాల్కనీ నుండి సీక్రెట్‌గా వెళ్తుండేవాడని చెప్పారు. ప్రణబ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..