చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నిపా వైరస్.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక, ముందు జాగ్రత్తలు..
సాధారణంగానే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఇతర కుటుంబ సభ్యులు వారిని ఎత్తుకోవటం, ఆడించటం చేస్తుంటారు. ఇలాంటి క్రమంలోనే ఇళ్లలో వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు ఇంట్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. పెద్దలతో పోల్చితే, పిల్లలకు నివారణ చర్యల పట్ల అవగాహన ఉండదు. కాబట్టి తల్లిదండ్రులే వారి బాధ్యతను తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని ఆపడానికి..
ఇప్పటికే కేరళలో నిపా వైరస్ కలకలం రేపింది. ఈ జూనోటిక్ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేరళ ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు వైరస్‌కు బలైపోగా, ఇప్పుడు 9 ఏళ్ల బాలుడు సహా మరికొంత మంది వ్యాధి బారిన పడ్డారు. వైరస్ వ్యాప్తి కాలం 21 రోజులు. కాబట్టి చివరి పాజిటివ్ కేసు నుండి 42 రోజుల డబుల్ ఇంక్యుబేషన్ పీరియడ్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసిఎంఆర్ అధ్యయనాలు కోజికోడ్‌లోనే కాకుండా మొత్తం రాష్ట్రానికి నిపా వైరస్ అంటువ్యాధి బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
నిపా వైరస్ (NV) ఇన్ఫెక్షన్ అనేది ఒక అరుదైన వ్యాధి. దీని మరణాల రేటు అధికంగా ఉంటుంది. ఇది 1998 నుండి అంటువ్యాధి రూపంలో అప్పుడప్పుడు కనిపించింది. భారతదేశంలో, ఇండో-బంగ్లాదేశ్ ప్రాంతం, కేరళలోని తీర ప్రాంతాలు నిపా వైరస్‌తో ప్రభావితమయ్యాయి. ఇది జూనోటిక్ వ్యాధి. అంటే, జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. నిపా వైరస్ పందులు, గబ్బిలాల నుంచి మానవులకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.
నిపా వైరస్ అనేది జూనోటిక్ ఇన్ఫెక్షన్. ఇది మనిషిని చంపేటంత తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది. పెద్దల కంటే ఎక్కువగా పిల్లలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. పిల్లల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఇది ఆందోళన కలిగించే విషయం. చిన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం కారణంగా వీరిలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు ఎక్కువగా వ్యాధి బారిన పడటానికి ప్రధాన కారణం వారిలోని బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు. పిల్లలు, ముఖ్యంగా, నవజాత శిశువుల్లో రోగనిరోధక వ్యవస్థ నిపా వైరస్ వంటి ఇన్ఫెక్షన్లను ఎదుర్కోలేదు.
సాధారణంగానే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఇతర కుటుంబ సభ్యులు వారిని ఎత్తుకోవటం, ఆడించటం చేస్తుంటారు. ఇలాంటి క్రమంలోనే ఇళ్లలో వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు ఇంట్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. పెద్దలతో పోల్చితే, పిల్లలకు నివారణ చర్యల పట్ల అవగాహన ఉండదు. కాబట్టి తల్లిదండ్రులే వారి బాధ్యతను తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని ఆపడానికి తరచుగా చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం, ఇతరుల నుండి భౌతిక దూరం పాటించడం అతి ముఖ్యం అంటున్నారు. నిపా వైరస్ పట్ల అందరిలో అవగాహన అతి ముఖ్యం. తల్లిదండ్రులు, ఇంట్లోని పెద్దలు, కుటుం సభ్యులకు వైరస్ వ్యాప్తి పట్ల అవగాహన కల్పించడం చాలా ముఖ్యం.
ముఖ్యంగా ఏదైనా తినడానికి ముందు, వాష్‌రూమ్‌ని ఉపయోగించిన తర్వాత, తరచుగా హ్యాండ్‌వాష్ లేదా సబ్బుతో చేతులు కడుక్కోవడం పిల్లలకు నేర్పండి. సబ్బు, నీరు లేనప్పుడు, 60% ఆల్కహాల్ ఉన్న చిన్న బాటిల్ శానిటైజర్‌ని వారి వెంట ఉంచుకోలే చూడండి. మార్కెట్‌లు లేదా బహిరంగ ప్రదేశాల్లో, మనిషికి మనిషికి దూరం పాటించటం, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పిల్లలకు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. నోరు, ముక్కు పూర్తిగా కప్పి ఉంచే మాస్క్‌లను మాత్రమే వాడాలి. నిపా వైరస్‌కి ఇంకా నిర్దిష్ట వ్యాక్సిన్ అందుబాటులో లేదు. mRNA నిపా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ కొనసాగుతోంది. నివారణ రోగనిరోధకత లేకపోవడం వల్ల పిల్లల్లో వైరస్‌కు ఎక్కువ అవకాశం ఉంది.
నిపా వైరస్ బాధితుల్లో ప్రారంభ లక్షణాలు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పి, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, మెదడువాపు, మూర్ఛ వంటిది కనిపిస్తుంది. వైరస్ సోకిన వారిలో కొన్ని సందర్భాల్లో వైరస్ లక్షణాలు కనిపించవు. కొంతమందిలో మాత్రం శ్వాస సంబంధిత సమస్యలు ఉంటాయి. అంతేకాకుండా ఈ వైరస్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఈ వైరస్‌కు సరైన చికిత్స, వ్యాక్సీన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడం వలన వైరస్ సోకిన వారిలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చు. లక్షణాలు గుర్తించిన తర్వాత చికిత్స అందించాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..