Handfish: అంతరించిపోయిందనుకున్న అరుదైన చేప చిక్కింది.. చేతులతో నడిచే..
CSIRO ప్రకారం, చుక్కల హ్యాండ్‌ఫిష్‌ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ద్వారా అంతరించిపోతున్న చేప జాతిగా గుర్తించారు. ఈ తీరాల వెంబడి చేపలు పట్టడం, వేటాడటం కారణంగా అవి అంతరించిపోతున్నాయి. వాటి చిన్న, ఒంటరి స్వభావం కారణంగా ఈ చేతులతో చేపలు చాలా అరుదు. 1990ల ముందు, మచ్చల హ్యాండ్‌ఫిష్‌లు సులభంగా కనిపించేవి. కానీ ఇప్పుడు ఇవి చాలా అరుదు. సముద్రంలో డైవర్లు 60 నిమిషాల్లో ఒకటి లేదా రెండు చేపలను మాత్రమే గుర్తించగలరు.
అంతరించిపోయిందని భావించిన అరుదైన రెండు చేతుల చేప 20 ఏళ్ల తర్వాత దొరికింది. రెక్కలకు బదులు చేతులతో ఉన్న ఈ వింత చేప ఆస్ట్రేలియాలోని టాస్మానియాలోని ప్రింరోస్ సాండ్స్ వద్ద బీచ్‌లో కనిపించింది. ప్రింరోస్ సాండ్స్ వద్ద బీచ్‌లో నడుచుకుంటూ వెళ్తున్న కెర్రీ యారే ఈ వింత చేపను గుర్తించారు. ఇది చివరిగా 20 సంవత్సరాల క్రితం కనిపించింది. ఈ ప్రత్యేకమైన చేపను చూసిన కెర్రీ యారే ఆశ్చర్యపోయారు.. చేప చూసిన వారి అనుభవాన్ని ఇలా వ్యాఖ్యానించారు.. “నేను గమనించే ప్రతి జీవి పట్ల నాకు ప్రత్యేక ఆసక్తి ఉంది. ఇది చిన్న పఫర్ ఫిష్, టోడ్ ఫిష్ లాగా కనిపించింది. ఈ రకమైన చేపలను నేను తరచుగా చూశాను. కానీ, మీరు ఈ చేపను నిశితంగా పరిశీలిస్తే, ఇసుక పొర కింద చిన్న చేతులు ఉన్నట్లు మీరు చూడవచ్చు. దీన్ని చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా అద్భుతమైనదని మీరు కూడా చెబుతారు.
అంతరించిపోతున్న జాతులలో ఒకటి ఈ చేతులు కలిగిన చేప. ఇలాంటి చేపలు సముద్రపు అడుగుభాగంలో నడవడానికి తమ చేతులను ఉపయోగిస్తాయి. ఇటీవల గుర్తించిన ఈ చేప అంతరించిపోయిందని భావించారు. కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సిఎస్‌ఐఆర్‌ఓ)కి చెందిన కార్లీ డివైన్ మాట్లాడుతూ, మొత్తం ప్రపంచంలో ఈ రకమైన చేపలు కేవలం 2,000 మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. అయితే ప్రింరోస్ సాండ్స్ వద్ద ఈ మచ్చల హ్యాండ్ ఫిష్ గత వారం గుర్తుపట్టక ముందే అంతరించిపోయిందని భావించారు. కానీ అది 2005 నుండి ఇక్కడే ఉండవచ్చని తాము భావిస్తున్నట్టుగా చెప్పారు.. కానీ, ఈ చేప తమకు ఎప్పుడు కనిపించలేదని చెప్పారు.
Spotted: a handfish! 👀
Last weekend, a runner found a critically endangered spotted handfish (Brachionichthys hirsutus) in Tasmania. Unfortunately the fish was dead, but it’s exciting evidence of life of a population we’d thought was locally extinct since 2005. pic.twitter.com/UzYHVZeTcO
— CSIRO (@CSIRO) September 10, 2023
CSIRO ప్రకారం, చుక్కల హ్యాండ్‌ఫిష్‌ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ద్వారా అంతరించిపోతున్న చేప జాతిగా గుర్తించారు. ఈ తీరాల వెంబడి చేపలు పట్టడం, వేటాడటం కారణంగా అవి అంతరించిపోతున్నాయి. వాటి చిన్న, ఒంటరి స్వభావం కారణంగా ఈ చేతులతో చేపలు చాలా అరుదు. 1990ల ముందు, మచ్చల హ్యాండ్‌ఫిష్‌లు సులభంగా కనిపించేవి. కానీ ఇప్పుడు ఇవి చాలా అరుదు. సముద్రంలో డైవర్లు 60 నిమిషాల్లో ఒకటి లేదా రెండు చేపలను మాత్రమే గుర్తించగలరు. కొన్నిసార్లు అది కూడా ఉండదని సముద్రంలో ఈ చేపను చూసిన కెర్రీ యారే చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..