AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ‘ఠాగూర్‌ శాంతినికేతన్ ఇల్లు..’ మోదీ పుట్టిన రోజు కానుక అంటున్న అభిమానులు..

భారతదేశ జాతీయ గీతం జనగణమన.. స్వరపరిచిన ఠాగూర్ ఇల్లు ఈ శాంతినికేతన్. భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన కేంద్ర బిందువు. ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశం 6వ స్థానంలో ఉంది.  ప్రధాన మంత్రి నరేంద్ర 73వ పుట్టినరోజు సందర్భంగా ఇంతకంటే మంచి బహుమతి లేదంటూ పలువురు మోదీ అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఆదివారం ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ మేరకు యునెస్కో ప్రకటించింది.  సోషల్ మీడియాలో

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 'ఠాగూర్‌ శాంతినికేతన్ ఇల్లు..' మోదీ పుట్టిన రోజు కానుక అంటున్న అభిమానులు..
Shantiniketan
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 17, 2023 | 10:05 PM

నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ నివసించిన ఇల్లు ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఈరోజు జరిగిన యునెస్కో సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సమావేశంలో శాంతినికేతన్‌ను వారసత్వ జాబితాలో చేర్చినట్లు ప్రకటన వెలువడగా, భారత అధికారులు భారత్ మాతా కీ జై అంటూ ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని బిర్ముమ్ జిల్లాలో ఉన్న శాంతినికేతన్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. భారతదేశంలోని 41 ప్రదేశాలను జాబితా కోసం పంపిచారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో సమావేశమైన వరల్డ్ హెరిటేజ్ కమిటీ 45వ సెషన్‌లో శాంతినికేతన్‌ను ఈ ప్రముఖ జాబితాలో చేర్చాలనే నిర్ణయం అధికారికంగా జరిగింది. ఆదివారం ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ మేరకు యునెస్కో ప్రకటించింది.  సోషల్ మీడియాలో “@UNESCO #ప్రపంచ వారసత్వ జాబితాలో కొత్త శాసనం: శాంతినికేతన్, #భారతదేశానికి అభినందనలు!” అనే క్యాప్షన్‌ ఇచ్చారు. కాగా, శాంతినికేతన్‌ను రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి మహర్షి దేవేంద్రనాథ్ 1863లో పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌లో స్థాపించారు. తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్ నాయకత్వం వహించి విశ్వభారతి విశ్వవిద్యాలయంగా మార్చారు.

భారతదేశ జాతీయ గీతం జనగణమన.. స్వరపరిచిన ఠాగూర్ ఇల్లు ఈ శాంతినికేతన్. భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన కేంద్ర బిందువు. ఈ శాంతినికేతన్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ అనేక సమావేశాలు నిర్వహించారు. మహాత్మా గాంధీతో చాలా సమావేశాలు జరిగాయి. స్వాతంత్ర్యానికి ముందు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఈ ఇల్లు ముఖ్యమైన పాత్ర పోషించింది. స్వాతంత్య్రానంతరం తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా ఈ సభలోనే ఠాగూర్‌ను కలుసుకుని చర్చలు జరిపారు.

భారతదేశంలోని 41 ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి.. 2021లో గంగావతి తాలూకాలోని హిరేబెంకల్‌లోని మౌర్యుల రాతియుగం ప్రాంతం యునెస్కో జాబితాలో చేర్చబడింది. హిరేబెనకల్ ప్రాంతంలోని ఒక కొండ రాతియుగపు రాతి సమాధులను కలిగి ఉంది. 2,000 కంటే ఎక్కువ నియోలిథిక్ శ్మశానవాటికలలో అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశం 6వ స్థానంలో ఉంది.  ప్రధాన మంత్రి నరేంద్ర 73వ పుట్టినరోజు సందర్భంగా ఇంతకంటే మంచి బహుమతి లేదంటూ పలువురు మోదీ అభిమానులు ప్రశంసిస్తున్నారు.

శాంతినికేతన్ ఎట్టకేలకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్టులో చేరినందుకు సంతోషంగానూ, గర్వంగానూ ఉందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..