Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేల ఏళ్ల చరిత్ర కలిగిన కమండల గణపతి ఆలయం.. ఇక్కడి తీర్థ స్నానం శని దోష నివారణం..! యోగ ముద్రలో వినాయకుడు..

యోగ ముద్రలో కూర్చున్న వినాయకుడు ఇక్కడి ప్రత్యేకం..ఇలాంటి విగ్రహం మరే ఇతర దేవాలయాల్లోనూ మనకు కనిపించదు. అలాగే ఈ గణేశ విగ్రహం ముందు తామరపువ్వు ఆకారంలో తీర్థకుండము ఉంటుంది..ఈ తీర్థాన్ని కమండల తీర్థం అని అంటారు. వినాయకునికి ఎదురుగా కనిపించే తీర్థకుండము ఉన్నందున ఇక్కడి వినాయకుడికి కమండల గణేశుడు అని పేరు వచ్చిందని చెబుతారు. ఈ నీటిలో స్నానం చేస్తే

వేల ఏళ్ల చరిత్ర కలిగిన కమండల గణపతి ఆలయం.. ఇక్కడి తీర్థ స్నానం శని దోష నివారణం..! యోగ ముద్రలో వినాయకుడు..
Kamandala Ganapati
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 17, 2023 | 9:10 PM

మన దేశంలో ఎన్నో వినాయక ఆలయాలు ఉన్నాయి. ఒక్కో వినాయకుడి ఆలయానికి ఒక్కో చరిత్ర, ప్రత్యేకతలు ఉంటాయి. వీటిలో కర్ణాటకలోని చిక్‌ మంగళూరులోని కొప్పలో కమండల గణపతి దేవాలయం ఉంది. పచ్చని ప్రకృతి అందాల మధ్య కొలువై ఉన్న గణేశుడు అద్భుతాలు సృష్టిస్తాడని భక్తుల నమ్మకం. ఎన్నో సోజిగలు కలిగిన ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతుంటారు. కమండల గణపతి దేవాలయం చిక్‌ మంగళూరు జిల్లా కొప్ప తాలూకా కేసవే గ్రామంలో ఉంది. ఈ ఆలయం ఎన్నో ఏళ్ల నాటి చరిత్ర కలిగిన దేవాలయం ఇది..భక్తులను ఎన్నో ఆశ్చర్యాలకు గురి చేస్తుంది. ప్రకృతి అందాల నడుమ వెలసిన వినాయకుడు అద్భుతాలు సృష్టిస్తాడని భక్తుల నమ్మకం. ఎన్నో సోజిగలు కలిగిన ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయం కొప్పా బస్టాండ్ నుండి 4 కి.మీ. దూరంలో ఉంది. వినాయక చవితి సందర్భంగా..ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం..

ఇక్కడి పురాణం ప్రకారం, ఒకసారి పార్వతీ దేవి శని దేవుడి నుండి తప్పించుకోవడానికి భూమిపైకి వచ్చి మైగవధే వద్ద తపస్సు చేసింది. అక్కడి నుంచి ఈ ఆలయం ఉన్న ప్రదేశానికి వచ్చి గణేశుడిని పూజించేందుకు సిద్ధమవుతుంది. కానీ, పూజకు నీళ్లు లేవు.. ఇక్కడి కథ ఏమిటంటే, బ్రహ్మదేవుడిని నీటి కోసం వేడుకున్నప్పుడు, బ్రహ్మ దేవుడు భూమిలోకి బాణం వేసి నీటిని సృష్టించాడు. ఇది బ్రాహ్మీ నదికి మూలమని కూడా చెబుతారు.

ఈ ఆలయానికి 18 కి.మీ. దూరంగా ఉన్న మృగవధేలో స్నానం చేసిన పార్వతీ దేవి,అనంతరం విఘ్నేశ్వరుడిని పూజించడానికి నీరు లేకపోవడంతో బ్రహ్మను వేడుకుంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు..ఒక బాణం వదిలి నీటిని తెచ్చిన ప్రదేశంగా చెబుతారు. అప్పటి నుంచి ఇక్కడ నీరు ఆగలేదు. తామరపువ్వు ఆకారంలో బ్రహ్మ బాణంతో ఏర్పడిన నీటి బుగ్గ ఇప్పటికీ అదే ఆకారంలో ప్రవహిస్తూ, క్రమంగా కమండల గణపతి దేవాలయంగా మారింది. బ్రాహ్మీ నది పుట్టుక కూడా ఇక్కడి నుంచే మొదలైందని చెబుతారు. వర్షాకాలంలో విఘ్నేశ్వరుని పాదాల వరకు కూడా ఎండాకాలం కంటే కొంచెం తక్కువగానే నీరు ప్రవహిస్తుంది. అయితే చరిత్రలో ఎన్నాడూ కూడా ఇక్కడ నీరు ఎండిపోయిన ఉదాహరణ లేదు. వర్షాకాలంలో ఈ తీర్థంలోని నీరు వినాయకుని పాదాల చెంతకు చేరుతుందనే నమ్మకంతో భక్తులు వస్తుంటారు. ఈ పురాణ వినాయకుడికి హారకా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.

ఇవి కూడా చదవండి

ఇక్కడ గణేశుడు యోగ ముద్రలో కొలువై ఉంటాడు. ఇక్కడ విఘ్న నాశకుడు యోగా చేస్తున్న భంగిమలో కూర్చున్నాడు. ఇంత విశిష్టమైన విగ్రహం దొరకడం చాలా అరుదు. యోగ ముద్రలో కూర్చున్న వినాయకుడు ఇక్కడి ప్రత్యేకం..ఇలాంటి విగ్రహం మరే ఇతర దేవాలయాల్లోనూ మనకు కనిపించదు. అలాగే ఈ గణేశ విగ్రహం ముందు తామరపువ్వు ఆకారంలో తీర్థకుండము ఉంటుంది..ఈ తీర్థాన్ని కమండల తీర్థం అని అంటారు. వినాయకునికి ఎదురుగా కనిపించే తీర్థకుండము ఉన్నందున ఇక్కడి వినాయకుడికి కమండల గణేశుడు అని పేరు వచ్చిందని చెబుతారు.

ఈ నీటిలో స్నానం చేస్తే శని రోగాలు నయమవుతాయని, విద్యార్థులు ఈ తీర్థం తాగితే జ్ఞానోదయం కలుగుతుందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. యోగ ముద్ర గణేశుడికి విల్లు కట్టితే కోరిక నెరవేరుతుంది. ఈ ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు మృగవధే ప్రదేశానికి వెళ్లి అక్కడ పూజలు చేస్తే మంచి జరుగుతుందని చెబుతారు. ఈ నమ్మకంతోనే ఈ ప్రదేశం వేలాది మంది పర్యాటకులు, భక్తులకు ఇష్టమైనది ప్రసిద్ధి చెందింది. స్థానికులు కూడా ఇక్కడికి వచ్చి అరగంట సేపు కూర్చుంటే మనశ్శాంతి లభిస్తుందని, రోజూ వచ్చి కూర్చుంటామని చెబుతుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..