Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanipakam: వినాయకుడి సన్నిధిలో చవితి వేడుక.. 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి పెద్దిరెడ్డి

వినాయక చవితి రోజున చందనం అలంకరణతో దర్శనం ఇవ్వనున్న వినాయకుడికి గణేష్ మాల ధరించిన భక్తులు మొక్కులు తీర్చుకోనున్నారు. ఇక సాయంత్రం భక్తులు పుష్పకావిడి సమర్పించనుండగా.. 19 న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు రాత్రి హంస వాహనంపై గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనుండగా బ్రహ్మోత్సవాల్లో భక్తులకు లక్ష లడ్డు ప్రసాదాలను దేవస్థానం సిద్ధం చేసింది.

Kanipakam: వినాయకుడి సన్నిధిలో చవితి వేడుక.. 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి పెద్దిరెడ్డి
Kanipakam Vinayaka Temple
Follow us
Raju M P R

| Edited By: Surya Kala

Updated on: Sep 18, 2023 | 7:09 AM

చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకుని సన్నిధి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. వినాయక చవితికి విద్యుత్ దీపాలతో వెలిగి పోతుంది. రారండోయ్ వేడుక చూద్దాం అంటూ వినాయక చవితి సంబరంతో సందడి నెలకొంది. 21 రోజులపాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు గణనాథుడి ఆలయంలో ఏర్పాట్లు పూర్తికాగా భద్రతతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా దేవాదాయశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి మంత్రి పెద్దిరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

గణనాథుడి బ్రహ్మోత్సవాలు

సత్య ప్రమాణాల సన్నిధి చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయం వినాయక చవితి వేడుకలతో భక్తులను ఆకట్టుకుంటోంది. వినాయక చవితి ఉత్సవాలతో ప్రారంభమయ్యే గణనాథుడి బ్రహ్మోత్సవాలు 21 రోజులపాటు జరగనుండగా ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు నుంచి అక్టోబర్ 8 వరకు జరిగే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అక్టోబర్ 8న తెప్పోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనుండగా ఈ మేరకు విస్తృత ఏర్పాట్లను చేసిన ఆలయ యంత్రాంగం వరసిడ్డుడి సన్నిధిని అలంకరించింది. విజ్ఞానానికి అధిపతి అయిన విజ్ఞేశ్వరుడు దర్శనం కోసం వచ్చే భక్తులకు విస్తృత ఏర్పాట్లను చేసింది. రాజగోపురం ద్వారాలు ధ్వజస్తంభంతో పాటు ఆలయాన్ని శుద్ది చేసి సిద్దం చేసిన ఆలయ యత్రాంగం భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లను ఏర్పాటు చేసింది.

ఆర్జిత సేవలు రద్దు

వినాయక చవితి సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు ఉభయదారుల ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం మూడున్నర గంటల నుంచి భక్తులకు స్వామి సర్వ దర్శనం కల్పించిన దేవస్థానం ఈ మేరకు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసింది. వీఐపీల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. వికలాంగులకు, వృద్ధులకు, చంటి బిడ్డల తల్లులకు ప్రత్యేక క్యూలైన్ లను ఏర్పాటు చేసింది. కాణిపాకం ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను కూడా అందంగా అలంకరించిన దేవస్థానం గణపతి హోమం యధావిధిగా నిర్వహించనుంది.

ఇవి కూడా చదవండి

రేపు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

వినాయక చవితి రోజున చందనం అలంకరణతో దర్శనం ఇవ్వనున్న వినాయకుడికి గణేష్ మాల ధరించిన భక్తులు మొక్కులు తీర్చుకోనున్నారు. ఇక సాయంత్రం భక్తులు పుష్పకావిడి సమర్పించనుండగా.. 19 న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు రాత్రి హంస వాహనంపై గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనుండగా బ్రహ్మోత్సవాల్లో భక్తులకు లక్ష లడ్డు ప్రసాదాలను దేవస్థానం సిద్ధం చేసింది. వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకుంటే విఘ్నాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసమంటున్నారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్.

పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి పెద్దిరెడ్డి

వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వినాయక చవితి రోజున జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. వినాయక చవితి రోజు ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు నుంచి లక్ష మందికి పైగానే భక్తులు వస్తారని అంచనా వేస్తున్న దేవాదాయ శాఖ బ్రహ్మోత్సవాల నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ ను కూడా కేటాయించింది. విద్యుత్ దీప అలంకరణలతో పాటు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి వినాయక చవితి రోజు అర్ధరాత్రి 11 గంటల దాకా భక్తులను స్వామివారి దర్శనానికి దేవస్థానం అనుమతించనుంది. సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామంటున్నారు కాణిపాకం దేవస్థానం ఈవో వెంకటేష్.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..