Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dream: కలలో గణపతి కనిపిస్తే ఏమవుతుంది.? జీవితంలో ఎలాంటి మార్పులొస్తాయి..

మనకు వచ్చే కలల ఆధారంగా జీవితంలో ఏం జరగనుందో చెప్పే శాస్త్రాన్ని స్వప్న శాస్త్రం అంటారు. వీటి ఆధారంగానే మనకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా.? అన్న విషయాలను జ్యోతిష్య పండితులు అంచనా వేస్తుంటారు. ఒకవేళ కలలో బంగారు వర్ణంలో ఉన్న వినాయకుడు కనిపిస్తే సంపద, అదృష్టాన్ని సూచిస్తుంది. మీరు జీవితంలో ఆర్థికంగా బలోపేతమవుతున్నారని దీని అర్థం...

Dream: కలలో గణపతి కనిపిస్తే ఏమవుతుంది.? జీవితంలో ఎలాంటి మార్పులొస్తాయి..
Lord Ganesha In Dream
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 18, 2023 | 7:05 AM

మనం ఎంత గాఢ నిద్రలో ఉన్నా మన మెదడు తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంటుంది. ఎన్నో జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. అయితే మనిషి నిద్రలో ఉన్న సమయంలో కూడా ఎన్నో కలలు వస్తుంటాయి. వీటిలో కొన్ని మంచి అనుభవాన్ని అందిస్తే, మరికొన్ని భయాన్ని కలిగిస్తుంటాయి. కొన్ని పీడ కలలు నిద్రలో నుంచి ఉలిక్కిపడేలా చేస్తే, మరికొన్ని మాత్రం సంతోషాన్నిస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో దేవతా మూర్తులు కూడా కలలో కనిపిస్తుంటారు. ఈ క్రమంలోనే గణేశుడు కలలో కనిపిస్తే అర్థం ఏంటి.? జీవితంలో ఎలాంటి మార్పులకు ఇది సూచన లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం…

మనకు వచ్చే కలల ఆధారంగా జీవితంలో ఏం జరగనుందో చెప్పే శాస్త్రాన్ని స్వప్న శాస్త్రం అంటారు. వీటి ఆధారంగానే మనకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా.? అన్న విషయాలను జ్యోతిష్య పండితులు అంచనా వేస్తుంటారు. ఒకవేళ కలలో బంగారు వర్ణంలో ఉన్న వినాయకుడు కనిపిస్తే సంపద, అదృష్టాన్ని సూచిస్తుంది. మీరు జీవితంలో ఆర్థికంగా బలోపేతమవుతున్నారని దీని అర్థం. అలాగే వినాయకుడు నృత్యం చేస్తూ కనిపిస్తే ఆనందం, స్వేచ్ఛలను సూచిస్తుంది. దీని అర్థం మీరు రానున్న రోజుల్లో ఉత్సాహంతో జీవితాన్ని గడుపుతారని.

ఒకవేళ కలలో బాల వినాయకుడు కనిపిస్తే జీవితంలో కొత్త ప్రారంభానికి సంకేతంగా భావించాలి. బాల వినాయకుడు అమాయకత్వం, స్వచ్ఛత, రక్షణకు ప్రతీకగా చెబుతారు. వినాయకుడు విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తే జీవితంలో ప్రశాంతమైన, స్థిరమైన దశను సూచిస్తుంది. మీరు జీవితంలో సౌకర్యవంతమైన స్థితిలో ఉన్నారని దాని అర్థం. ఇక విరిగిన దంతంతో కూడిన వినాయకుడి రూపం కలలో కనిపిస్తే అది త్యాగానికి ప్రతీకగా చెప్పొచ్చు. తొండం అడ్డంకులను అధిగమించడాన్ని సూచిస్తుంది. ఇక ఏనుగు ఉన్న వినాయకుడి రూపం కలలో దర్శనమిస్తే.. మీరు మీ కోరికలపై నియంత్రణ పొందుతున్నారని అర్థం. మీ నిర్ణయాలలో జ్ఞానం పొందుతున్నారని అర్థం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..