- Telugu News Photo Gallery Spiritual photos Brahmotsavam to begin at Tirumala: CM YS Jagan Mohan reddy to inaugurate Srinivasa Setu project during Tirumala Brahmotsavams
Tirumala: నేడు ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం .. రాత్రి శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్న సీఎం జగన్
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 26వ తేదీ వరకూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించారు. యాగశాలలో భూమాతకు పూజలు నిర్వహించి నవధాన్యాలను నాటారు.
Updated on: Sep 18, 2023 | 8:36 AM

ఈ రోజు నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ...తొమ్మిది రోజులు పాటు వైభవంగా జరగనున్నాయి. ఈ రోజు సాయంత్రం 6:15 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

రాత్రి 8 గంటలకు శ్రీవారి పట్టువస్త్రాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి సమర్పించనున్నారు. బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీవారికి పట్టు వస్త్రాలను తీసుకుని వెళ్లి సీఎం జగన్ స్వామివారికి సమర్పించనున్నారు.

ఈ నేపథ్యంలో నేడు తిరుపతికి సీఎం జగన్ పయనం కానున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.

అనంతరం 3.50 గంటలకు తిరుపతిలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. స్వయంగా భవనాలను ప్రారంభించనున్నారు

అంతేకాదు ఇక్కడే టీటీడీ ఉద్యోగులకు సీఎం జగన్ ఇంటి స్థలాల పంపిణీ చేయనున్నారు.

ఇళ్ల స్థలాల పంపిణీ అనంతరం సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మను సీఎం జగన్ దర్శించుకుని అమ్మవారికి పూజలు చేయనున్నారు. అనంతరం నేరుగా తిరుమలకు పయనం కానున్నారు.

తిరుమలకు చేరుకున్న తర్వాత సీఎంజగన్ సాయత్రం 5.40 గంటలకు తిరుమలలో వకుళమాత రెస్ట్ హౌస్ కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి పద్మావతి అతిధి గృహం చేరుకుని రాత్రి 7:45 గంటలకు బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకుని సీఎం శ్రీవారికి సమర్పించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి 9 గంటలకు పెద్దశేషవాహనంపై ఊరేగనున్నారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి. ఈ పెద్ద శేష వాహన సేవలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు.





























