- Telugu News Photo Gallery Spiritual photos Vastu tips of coconut: remedies in astrology successful life health tips uses of Coconut tree
Coconut Vastu Tips: హిందూ సాంప్రదాయంలో కొబ్బరికి విశిష్ట స్థానం.. ఇంట్లో కొబ్బరి చెట్టుని ఏ దిశలో నాటాలో తెలుసా..
హిందూ మతంలో ప్రకృతిని దైవం కొలుస్తారు. జంవుతులు, పక్షులు, చెట్లు ఇలా ప్రతి దానిలో దైవాన్ని చూస్తారు. భక్తి శ్రద్దలతో పూజిస్తారు. సనాతన హిందూ సంప్రదాయంలో పూజకు.. పూజలో ఉపయోగించే ద్రవ్యాలకు విశిష్ట స్థానం ఉంది. పండగలు, పర్వదినాలు, శుభకార్యాల్లో కొబ్బరికాయను ఉన్నతమైన స్థానం ఉంది. కొబ్బరికాయను శ్రీఫలం అని పిలుస్తారు. దీనిని ఎల్లప్పుడూ పూజలో ఉపయోగిస్తారు. అయితే కొబ్బరి కాయకు మాత్రమే కాదు కొబ్బరి చెట్టుకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది.
Updated on: Sep 18, 2023 | 10:35 AM

హిందువులు కొబ్బరి చెట్టును దైవంగా పూజిస్తారు. కొబ్బరి చెట్టుపై లక్ష్మీ దేవి నివసిస్తుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంటే ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. ఈ నేపథ్యంలో వాస్తు శాస్త్రం ప్రకారం కొబ్బరి చెట్టుకు సంబంధించిన కొన్ని నియమాలు పేర్కొన్నాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే.. పనికి తగిన ఫలితం రాకపోతే ఇంటి ఆవరణలో కొబ్బరి చెట్టును నాటడం శుభప్రదం. అంతేకాదు ఉద్యోగ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

కొబ్బరి చెట్టు నాటడం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అలాగే ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి. కొబ్బరి చెట్టును ఎల్లప్పుడూ ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలో నాటాలి.. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.

కొబ్బరి చెట్టుకు హిందూ మతపరమైన నమ్మకాలతో పాటు.. కొబ్బరి వినియోగం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని నీటి లోపాన్ని తీరుస్తుంది. కొబ్బరిలో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం, ఫైబర్ మరియు కాల్షియం లభిస్తాయి.

వాస్తు ప్రకారం కొబ్బరికి సంబంధించిన ఈ ప్రత్యేక నివారణలున్నాయి. జీవితంలో ఎదైనా సమస్య లేదా కష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే.. కొబ్బరికి సంబంధించిన రెమెడీలు పాటించి చూడండి. ఇలా చేయడం వలన అనేక సమస్యలు పరిష్కరం అవుతాయి.

అనేక పరిహారాలను నీళ్లతో నిండిన కొబ్బరికాయ చేస్తుంది. మంగళవారం లేదా శనివారం కొబ్బరి కాయను దేవాలయంలో సమర్పించండి. ఇలా చేయడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందుతారు.





























