Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Naidu arrest: మరోసారి పోస్ట్ కార్డ్ ఉద్యమం..! చంద్రబాబును విడుదల చేయాలంటూ అభిమానుల వినూత్న నిరసన..

ఎప్పుడో కనుమరుగయిన పోస్ట్ కార్డులను ఇప్పుడు టిడిపి తెరపైకి తెచ్చింది. టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన విడుదలవ్వాలని, క్షేమంగా ఉండాలని టిడిపి కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వీటితో పాటు

Chandrababu Naidu arrest: మరోసారి పోస్ట్ కార్డ్ ఉద్యమం..! చంద్రబాబును విడుదల చేయాలంటూ అభిమానుల వినూత్న నిరసన..
Chandrababu Naidu
Follow us
T Nagaraju

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 17, 2023 | 6:27 PM

ఎప్పుడో కనుమరుగైన పోస్ట్ కార్డు ఉద్యమం మరోసారి తెరపైకి వచ్చింది. స్వాతంత్ర్య సంగ్రామంలో పోస్ట్ కార్డు ఉద్యమం చాలా ప్రముఖ పాత్ర వహించింది. మొబైల్ ఫోన్స్ లేని కాలంలో పోస్ట్ ఆఫీస్ లు, పోస్ట్ కార్డు, కవర్లతోనే వివిధ అంశాలను ప్రజలకు చేరవేసేవారు. స్వాతంత్ర్య సంగ్రామంలో అహింసా పద్దతుల్లో పోరాడుతున్న అనేకమంది పోస్ట్ కార్డు ఉద్యమం చేసేవారు. స్వాతంత్ర్యం అనంతర కాలంలో కూడా కార్డు, కవర్లు సమాచార పంపిణీకి ఉపయోగపడ్డాయి. అయితే గత పదేళ్ల కాలంలో మొబైల్ విప్లవం రావడంతో పోస్ట్ ఆఫీస్ లు, కార్డ్ లు, ఇన్ ల్యాండ్ కవర్లు కనుమరుగయ్యాయి. పేరుకు మాత్రమే వీటిని పోస్ట్ ఆఫీస్ ల్లో విక్రయిస్తున్నారు. వీటిని వినయోగించేవారు మాత్రం లేరు.

అయితే, ఎప్పుడో కనుమరుగయిన పోస్ట్ కార్డులను ఇప్పుడు టిడిపి తెరపైకి తెచ్చింది. టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన విడుదలవ్వాలని, క్షేమంగా ఉండాలని టిడిపి కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వీటితో పాటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా చంద్రబాబు క్షేమంగా ఉండాలని కోరుతూ అనేక మంది రాజమంత్రి సెంట్రల్ జైలుకు పోస్ట్ కార్డులు వేస్తున్నారు. పొన్నూరు దీక్ష శిబిరం వద్ద మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణతో పాటు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూడా పోస్ట్ కార్డు ఉద్యమంలో పాల్గొని చంద్రబాబుకు పోస్ట్ కార్డు రాశారు.

Support For Chandrababu

గుంటూరులో అరండల్ పేట పోస్టాఫీస్ వద్ద చాలా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని పోస్ట్ కార్డులు కొనుగోలు చేసి వాటిపై చంద్రబాబు క్షేమంగా ఉండాలని కోరుతూ పోస్ట్ కార్డులు పోస్ట్ బాక్స్ లో వేశారు. పోస్టాఫీస్ వద్ద అనేకమంది కార్యకర్తలు ఉండటాన్ని చూసిన పాదాచారాలు ఏంటా విషయం అంటూ ఆరా తీయడం కనపించింది.

ఇటు, తెలంగాణలోనూ పలుచోట్ల టీడీపీ అభిమానులు చంద్రబాబును అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మంలో అభిమానులు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం నగరంలోని ప్రధాన రహదారుల్లో వందలాది కార్లతో అభిమానులు ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న అభిమానులు.. ఐ యామ్‌ విత్‌ సీబీఎన్‌ అంటూ ప్లకార్డులు, జెండాలు ప్రదర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..