Diamond: రైతు పంట పండింది.. విలువైన వజ్రం దొరికింది.. ధర ఎంతో తెలుసా..!
కర్నూలు జిల్లాలో ఓ రైతు పంటపడింది. పొలంలో అతడికి విలువైన వజ్రం దొరికింది. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన రైతు పనుల నిమిత్తం పొలం వెళ్లగా.. అతనికి వజ్రం దొరికింది. ఈ విషయం తెలియడంతో పెరవలికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి 8 లక్షల రూపాయలు ఇచ్చి వజ్రాన్ని కొనుగోలు చేశారు. ఇటీవలే జొన్నగిరికి చెందిన మరో రైతుకు వజ్రం దొరికింది. వెంటనే వ్యాపారి దగ్గరకు తీసుకెళ్లి నాణ్యతను చెక్ చేయించాడు. విలువైన వజ్రం అని తెలియక..
కర్నూలు జిల్లాలో ఓ రైతు పంటపడింది. పొలంలో అతడికి విలువైన వజ్రం దొరికింది. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన రైతు పనుల నిమిత్తం పొలం వెళ్లగా.. అతనికి వజ్రం దొరికింది. ఈ విషయం తెలియడంతో పెరవలికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి 8 లక్షల రూపాయలు ఇచ్చి వజ్రాన్ని కొనుగోలు చేశారు. ఇటీవలే జొన్నగిరికి చెందిన మరో రైతుకు వజ్రం దొరికింది. వెంటనే వ్యాపారి దగ్గరకు తీసుకెళ్లి నాణ్యతను చెక్ చేయించాడు. విలువైన వజ్రం అని తెలియక అతను 2 లక్షలకే ఓ వ్యాపారికి అమ్మేశాడు. ఆ తర్వాత ఆ వజ్రం చాలా విలువైనదని తెలిసింది. తొలకరి తర్వాత వర్షాలు మొదలుకాగానే కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మొదలవుతుంది. పొలాలు, కొండల వెంట స్థానికులతో పాటూ చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా జనాలు వచ్చి గాలిస్తుంటారు. ఒక్క వజ్రమైనా దొరక్కపోతుందా.. తమ జీవితం మారకపోతుందా అన్న ఆశతో వజ్రాల వేటలో మునిగిపోతారు. ఈ సీజన్‌లో కూడా చాలామంది రైతులు, కూలీలకు వజ్రాలు చిక్కాయి. కొన్ని వజ్రాలకు భారీ ధర పలికింది. ఈ వజ్రాలను దక్కించుకునేందుకు వ్యాపారులు కూడా అక్కడే మకాం పెట్టారు. వజ్రం దొరికిందని తెలిస్తే చాలు దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

