Viral: విమానాశ్రయంలో సిబ్బంది చేతివాటం.. చెకింగ్ పేరుతో చోరీ.. వీడియో.

Viral: విమానాశ్రయంలో సిబ్బంది చేతివాటం.. చెకింగ్ పేరుతో చోరీ.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Sep 18, 2023 | 6:48 AM

విమానాల్లో ప్రయాణించేవారు లగేజ్‌ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే విమానాశ్రయాలలో సెక్యూరిటీ చెకింగ్ పకడ్బందీగా జరుగుతుంది. అమెరికాలో అయితే ఇది మరింత నిశితంగా జరుగుతుంటుంది. ప్రయాణికులు తమ లగేజ్ తో పాటు పర్సులు, ఒంటి మీద ఉన్న ఆభరణాలు కూడా తీసి ఓ బాక్స్ లో పెట్టి స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. భద్రతాపరమైన ఏర్పాట్లలో భాగంగా చేసే ఈ తనిఖీల విషయంలో సిబ్బంది చాలా కచ్చితంగా ఉంటారు.

విమానాల్లో ప్రయాణించేవారు లగేజ్‌ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే విమానాశ్రయాలలో సెక్యూరిటీ చెకింగ్ పకడ్బందీగా జరుగుతుంది. అమెరికాలో అయితే ఇది మరింత నిశితంగా జరుగుతుంటుంది. ప్రయాణికులు తమ లగేజ్ తో పాటు పర్సులు, ఒంటి మీద ఉన్న ఆభరణాలు కూడా తీసి ఓ బాక్స్ లో పెట్టి స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. భద్రతాపరమైన ఏర్పాట్లలో భాగంగా చేసే ఈ తనిఖీల విషయంలో సిబ్బంది చాలా కచ్చితంగా ఉంటారు. అనుమానాస్పద వస్తువులను ఎయిర్ పోర్ట్ లోపలికి అనుమతించరు. అయితే, ఈ సెక్యూరిటీ చెకింగ్ దగ్గర విమానాశ్రయ సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించారు. ప్రయాణికుల బ్యాగులు, పర్సుల్లో నుంచి నగదుతో పాటు ఇతరత్రా విలువైన వస్తువులను కొట్టేశారు. అమెరికాలోని మయామి ఎయిర్ పోర్టులో చోటుచేసుకుందీ ఘటన. ఉద్యోగుల చేతివాటం అక్కడున్న సీసీకెమెరాల్లో రికార్డు కావడంతో ఎయిర్ పోర్ట్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. సదరు ఉద్యోగులు ఇద్దరినీ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఏడాది జూన్ 29న మయామి ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు తమ లగేజీని సెక్యూరిటీ స్కాన్ కోసం మెషిన్ పై పెట్టగా.. అక్కడ విధుల్లో ఉన్న ట్రాన్స్ పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగులు ఇద్దరు వాటిని స్కానింగ్ మెషిన్ లోకి పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి లగేజీలో ఉన్న పర్సులో నుంచి 600 డాలర్లను, మరో ప్రయాణికుడి లగేజీలో నుంచి నగదును కొట్టేశారు. దీంతో వారిద్దరినీ జూలైలో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో నిందితులు ఇద్దరూ కలిసి రోజుకు సగటున వెయ్యి డాలర్ల దాకా కాజేస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈ చోరీలకు సంబంధించి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..