Libya: వీధుల్లో బురద మేటలు.. తవ్వితే శవాల గుట్టలు.. లిబియాలో భయానక దృశ్యాలు..

Libya: వీధుల్లో బురద మేటలు.. తవ్వితే శవాల గుట్టలు.. లిబియాలో భయానక దృశ్యాలు..

Anil kumar poka

|

Updated on: Sep 17, 2023 | 4:44 PM

లిబియాలో మరణమృదంగం కొనసాగుతోంది. డేనియల్‌ తుపాను సృష్టించిన జలప్రళయంతో లిబియాలో భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయి. నివాస ప్రాంతాలు, వీధుల్లో ఎటుచూసినా బురద మేటలు ఉన్నాయి. వాటి కింద శవాలు గుట్టలుగా బయటపడుతున్నాయి. మరోవైపు సముద్ర జలాల నుంచి వందల సంఖ్యలో మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. సెప్టెంబరు 14 నాటికి ఈ నగరంలో 11,300 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు.

లిబియాలో మరణమృదంగం కొనసాగుతోంది. డేనియల్‌ తుపాను సృష్టించిన జలప్రళయంతో లిబియాలో భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయి. నివాస ప్రాంతాలు, వీధుల్లో ఎటుచూసినా బురద మేటలు ఉన్నాయి. వాటి కింద శవాలు గుట్టలుగా బయటపడుతున్నాయి. మరోవైపు సముద్ర జలాల నుంచి వందల సంఖ్యలో మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. సెప్టెంబరు 14 నాటికి ఈ నగరంలో 11,300 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. గల్లంతైన మరో 10,100 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. వారంతా మరణించి ఉండొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మృతుల సంఖ్య 20 వేలకు పైనే ఉండొచ్చని అధికారులు ఇప్పటికే అనధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతదేహాలు, గల్లంతైనవారి కోసం అన్వేషించేందుకు వీలుగా అధికారులు సప్టెంబర్‌ 15న డెర్నా నగరాన్ని మూసివేశారు. ప్రజలను బయటకు తరలించి సహాయక బృందాలు బురద మేటలను త్వరితగతిన తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు ధ్వంసమైన ఇళ్ల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలింపును ముమ్మరం చేశారు. డెర్నాలో ఇప్పటికే మృతుల సంఖ్య భారీగా ఉండగా, అధికారులను మరో ఆందోళనకర అంశం కలవరపాటుకు గురిచేస్తోంది. 2011 నుంచి అంతర్గత ఘర్షణలు కొనసాగుతున్న లిబియాలో పెద్ద ఎత్తున మందుపాతరలు పాతిపెట్టినట్లు తెలుస్తోంది. దీంతోపాటు రెండో ప్రపంచ యుద్ధం నాటి పేలుడు పదార్థాలు కూడా లిబియాలో ఉన్నట్లు సమాచారం. ఇవి వరద నీటిలో కొట్టుకొని ఉండొచ్చని, సహాయక చర్యలు చేపట్టేటప్పుడు అవి పేలితే ప్రాణ నష్టం మరింత పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..