నువ్వులనూనె ఆరోగ్య లాభాలు తెలుసా..? ముఖ సౌందర్యం, జుట్టుకు మ్యాజిక్‌ చేస్తుంది..!

ఇది చర్మాన్ని డార్క్ స్పాట్స్ నుండి కాపాడుతుంది. చర్మంపై మృతకణాలను తొలగించి.. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. నువ్వుల నూనెను చర్మంపై క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల చర్మ క్యాన్సర్‌తో సహా చర్మ సమస్యలను నివారిస్తుంది. స్నానానికి ముందు నువ్వుల నూనె రాసుకోవడం వల్ల క్లోరినేటెడ్ నీటి హానికరమైన ప్రభావాల నుండి చర్మాన్ని రక్షించుకోవచ్చు. ముఖం, బాడీ స్క్రబ్‌లలో నువ్వులను ఉపయోగించే స్క్రబ్ టాన్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.

నువ్వులనూనె ఆరోగ్య లాభాలు తెలుసా..? ముఖ సౌందర్యం, జుట్టుకు మ్యాజిక్‌ చేస్తుంది..!
Sesame Seeds Oil
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 19, 2023 | 1:38 PM

నూనె ప్రయోజనాలు బోలెడు.. ప్రాచీనకాలం నుండి ఈ నువ్వుల నూనెను వంటలకు, వివిధ అనారోగ్య సమస్యలకు చికిత్స వాడుతున్నారు. ఇందులో ప్రొటీన్లు నిండుగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, బి కాంప్లెక్స్, ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజ లవణాలను కలిగి ఉంటుంది. నువ్వుల నూనెలో పోషక, నివారణ, వైద్యం చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయుర్వేదంలో, నువ్వుల నూనెను వివిధ ఆరోగ్య సమస్యలకు నివారణగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా నువ్వుల నూనె సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షించే గుణాలు కలిగి ఉంటుంది.. అందువల్ల, ఆయుర్వేదంలో నువ్వుల నూనెను మసాజ్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇందులో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. విటమిన్లు B, E సమృద్ధిగా ఉన్నాయి.

నువ్వుల నూనె చర్మం, జుట్టు సంరక్షణకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఇది చర్మాన్ని బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించి ఆరోగ్యంగా ఉంచుతుంది.

నువ్వుల నూనె అథ్లెట్స్ ఫుట్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లను కూడా నయం చేస్తుంది. ఇది చర్మానికి పోషణనిస్తుంది. చర్మం ఉపరితలంపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మం, జుట్టు కుదుళ్లకు పోషకాలను అందిస్తుంది. నువ్వుల నూనె ప్రభావం చాలా తేలికపాటిది. శిశువుల చర్మంపై మసాజ్‌ కోసం ఉపయోగించడం మంచిది.

ఇవి కూడా చదవండి

సూర్యకిరణాల నుండి రక్షించే లక్షణాల కారణంగా, నువ్వుల నూనె వివిధ చర్మ సమస్యలను తగ్గించడానికి, UV కిరణాల వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని డార్క్ స్పాట్స్ నుండి కాపాడుతుంది. చర్మంపై మృతకణాలను తొలగించి.. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. నువ్వుల నూనెను చర్మంపై క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల చర్మ క్యాన్సర్‌తో సహా చర్మ సమస్యలను నివారిస్తుంది. స్నానానికి ముందు నువ్వుల నూనె రాసుకోవడం వల్ల క్లోరినేటెడ్ నీటి హానికరమైన ప్రభావాల నుండి చర్మాన్ని రక్షించుకోవచ్చు. ముఖం, బాడీ స్క్రబ్‌లలో నువ్వులను ఉపయోగించే స్క్రబ్ టాన్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.

నువ్వుల స్క్రబ్ సిద్ధం చేయడానికి, నువ్వులు, పుదీనా ఆకులు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, తేనె తీసుకోండి. నువ్వులను బాగా గ్రైండ్ చేసి, ఎండిన పుదీనా ఆకులను వేసి పొడి చేసుకోవాలి. దీంట్లో నిమ్మరసం, కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి, చేతులకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. కాసేపు అలాటే వదిలేయండి.. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. నువ్వులు కూడా టాన్ తొలగించడంలో సహాయపడతాయి. పుదీనా చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. తేనె చర్మాన్ని తేమగా, మృదువుగా చేస్తుంది.

నువ్వులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి, అవి జుట్టుకు కూడా మేలు చేస్తాయి. ఇది చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యల నుండి జుట్టు, శిరోజాలను రక్షించడంలో సహాయపడుతుంది. వాస్తవానికి, ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. వేడిచేసిన నువ్వుల నూనెను తలకు వెంట్రుకలకు అప్లై చేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. ఇది జుట్టుకు పోషణనిచ్చి మృదువుగా చేస్తుంది. నువ్వుల నూనె జుట్టు చివర్లు చీలిపోవడాన్ని నివారిస్తుంది. జుట్టుకు మెరుపును ఇస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే