AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తింటే ఆ సమస్య కూడా.. తాజా పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు..

ఇదేదో అషామాషీగా చెబుతోన్న విషయం కాదు. కొంత మందిపై పరిశోధనలు చేసిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. నిత్యం ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తినేవారు నిరాశ, నిస్పృహ, ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. చైనాకు చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల్లో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ వివరాలను ది నేషనల్ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ అనే....

Health: ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తింటే ఆ సమస్య కూడా.. తాజా పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు..
French Fries
Narender Vaitla
|

Updated on: Sep 19, 2023 | 1:25 PM

Share

ఫ్రెంచ్‌ ఫ్రైస్.. ఈ తరం వారికి వీటి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్నాక్స్‌ అనగానే ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ అనే రోజులు వచ్చేశాయ్‌. రెస్టారంట్స్‌తో పాటు ఇంట్లో కూడా సింపుల్‌గా చేసుకునే అవకాశం ఉండడంతో వీటికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా చిన్నారులు ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే నూనెలో వేయించే ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు వేధిస్తాయనే విషయం తెలిసిందే. అయితే కేవలం శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ ప్రభావం చూపుతుందిన పరిశోధకులు చెబుతున్నారు.

ఇదేదో అషామాషీగా చెబుతోన్న విషయం కాదు. కొంత మందిపై పరిశోధనలు చేసిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. నిత్యం ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తినేవారు నిరాశ, నిస్పృహ, ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. చైనాకు చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల్లో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ వివరాలను ది నేషనల్ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ అనే జర్నల్‌లో ప్రచురించార. సుమారు లక్షన్నర మందిపై ఏకంగా 11 ఏళ్ల పాటు నిర్వహించిన పరిశోధనల అనంతరం శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ మనిషి మానసిక ఆరోగ్యంపై కచ్చితంగా ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఫ్రెంచ్‌ ఫ్రైస్ తిననివారితో పోల్చితే తినే వార 12 శాతం అధికంగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. 7 శాతం నిరాశ, నిస్పృహకు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే డిప్రెషన్‌కు గురైన వారు ఫ్రెంచ్‌ ఫ్రైస్‌కు ఆకర్షితులవుతున్నారా.? లేదా ఫ్రెంచ్‌ ఫ్రైస్ తినడం వల్లే డిప్రెషన్‌ బారిన పడుతున్నారా.? అన్న దానిపై మాత్రం ఎలాంటి స్పష్టతరాలేదు. ఇది ఎక్కువగా యువకుల్లో కనిపించినట్లు పరిశోధనల్లో తేలింది.

ఆందోళన, నిరాశలో ఉన్న వారు ఎక్కువగా ఫ్రెంచ్‌ ఫ్రైస్‌కు ఆకర్షితులవుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. తమ మూడ్‌ను మార్చుకునేందుకు తరచుగా ఆహారం వైపు మొగ్గు చూపుతున్నట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. డిప్రెషన్‌, ఆందోళనతో బాధపడుతోన్న సమయంలో వీలైనంత వరకు జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉంటూ పండ్లు, కూరగాయలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒత్తిడిని జయించేందుకు మెడిటేషన్‌, యోగా వంటివి అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..