Gas Cleaning Tips: గ్యాస్‌ బర్నర్‌ను ఈజీగా ఎలా క్లీన్‌ చెయ్యాలో తెలుసా..? వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..

గ్యాస్‌ స్టవ్‌ మీద వంట చేయడం ఈజీగానే ఉంటుంది. కానీ, దాన్ని క్లీన్‌ చేసేప్పుడే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. స్టవ్‌పై ఏర్పడ్డ జిడ్డు, వంట చేస్తున్నప్పుడు పడే ఇతర పదార్థాల శుభ్రం చేసే క్రమంలో తరచూ స్టవ్‌ బర్నల్‌పై కూడా నీళ్లు, సబ్బు పడుతుంటాయి. దాంతో గ్యాస్‌ స్టవ్‌ మంటలో తేడా వస్తుంది.. అలాంటప్పుడు గ్యాస్‌ స్టవ్‌ బర్నల్‌ క్షణాల్లో శుభ్రం చేయడానికి చాలా మంది వంటింటి చిట్కాలను అనుసరిస్తుంటారు. అలాంటి ఒక వీడియో ఇప్పుడు ఇంటర్‌ నెట్‌లో వైరల్‌గా మారింది. వీడియోలో గ్యాస్ స్టవ్ బర్నర్‌లను శుభ్రం చేయడానికి చాలా సులభమైన ట్రిక్‌ చూపించారు.

Gas Cleaning Tips: గ్యాస్‌ బర్నర్‌ను ఈజీగా ఎలా క్లీన్‌ చెయ్యాలో తెలుసా..? వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..
Gas Stove Burners
Follow us

|

Updated on: Sep 19, 2023 | 1:08 PM

వంటగదిని శుభ్రం చేయడం ఒక టాస్క్‌ అనే చెప్పాలి.. వంటిళ్లు ప్రతి మూల, సందులోనూ జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. వంటింట్లో తరచూ ఏర్పడే నూనె, జిడ్డు మరకలను శుభ్రం చేసేందుకు ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. గ్యాస్‌ స్టవ్‌ మీద వంట చేయడం ఈజీగానే ఉంటుంది. కానీ, దాన్ని క్లీన్‌ చేసేప్పుడే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. స్టవ్‌పై ఏర్పడ్డ జిడ్డు, వంట చేస్తున్నప్పుడు పడే ఇతర పదార్థాల శుభ్రం చేసే క్రమంలో తరచూ స్టవ్‌ బర్నల్‌పై కూడా నీళ్లు, సబ్బు పడుతుంటాయి. దాంతో గ్యాస్‌ స్టవ్‌ మంటలో తేడా వస్తుంది.. అలాంటప్పుడు గ్యాస్‌ స్టవ్‌ బర్నల్‌ క్షణాల్లో శుభ్రం చేయడానికి చాలా మంది వంటింటి చిట్కాలను అనుసరిస్తుంటారు. అలాంటి ఒక వీడియో ఇప్పుడు ఇంటర్‌ నెట్‌లో వైరల్‌గా మారింది. వీడియోలో గ్యాస్ స్టవ్ బర్నర్‌లను శుభ్రం చేయడానికి చాలా సులభమైన ట్రిక్‌ చూపించారు. దాంతో గ్యాస్‌ బర్నర్‌ కొత్తదానిలా కనిపించింది.

గ్యాస్‌ స్టవ్‌ బర్నర్‌ శుభ్రం చేయడానికి ముందుగా.. వీడియోలో ప్రక్రియ స్టీల్ బౌల్ తీసుకున్నారు. అందులో మురికిగా మారిన రెండు బర్నర్‌లను ఉంచారు. ఆ తర్వాత గిన్నెలో కాస్త వేడినీళ్లు వేసి అందులో సగం నిమ్మకాయను పిండారు. అంతేకాదు.. నిమ్మకాయ  తొక్కను కూడా అందులోనే వేశారు. ఆ తర్వాత బాగా మరిగించిన వేడినీళ్లలో పై నుంచి పోశారు. ఆ తర్వాత ఒక ఇనో ప్యాకెట్‌లోని పౌడర్‌ మొత్తాన్ని ఆ నీళ్లలో పోశారు. ఆ తర్వాత దానిపై ఒక మూతపెట్టి ఒక గంటపాటు పక్కన పెట్టేశారు.

ఇవి కూడా చదవండి

ఒక గంట తర్వాత..డిష్‌వాష్‌ జెల్‌ తీసుకుని టూత్ బ్రష్‌తో బర్నర్‌ని కాస్త రబ్‌ చేస్తూ వాష్‌ చేశారు. అంతే దానిపై ఉన్న నలు, జిడ్డు మొత్తం అంతా పోయింది. బర్నర్‌లు మెరుస్తూ శుభ్రంగా కనిపిస్తున్నాయి. వీడియోలో అంతకు ముందు, వాష్‌ చేసిన తర్వాత బర్నర్‌ ఎలా మారిందో కూడా చూపించారు. ఈ అద్భుతమైన క్లీనింగ్ హ్యాక్ 2.8 మిలియన్ల వీక్షణలను సంపాదించింది. చాలా మంది వీక్షకుల నుండి వచ్చిన కామెంట్స్‌, ప్రశంసలతో సందడి చేస్తోంది.

వీడియోపై స్పందించిన నెటిజన్లు ఒక్కొక్కరూ ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు ఇంలాంటి వంటింటి హక్స్‌ చాలా మందికి యూజ్‌ అవుతాయంటున్నారు. మరికొందరు మంచి సమాచారం అంటున్నారు. ఇంకొందరు అద్భుతమైన ఆలోచన అంటున్నారు. అయితే, ఇనో దాని అసలు ప్రయోజనం తప్ప ప్రతిదానికీ ఉపయోగించవచ్చునని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..
'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!