AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: తన కలను నెరవేర్చుకోవడానికి చేతులారా కంటి చూపు పోగొట్టుకున్న యువతి.. ఆమె చెప్పిన రీజన్ తెలిస్తే షాక్..

అంధులు ఒక్కసారైనా ప్రకృతిని కనులారా చూడాలని కోరుకుంటారంటే అతిశయోక్తి కాదు. అయితే కాలిఫోర్నియాకు చెందిన ఒక మహిళ తన జీవితాన్ని అంధురాలిగా గడపాలని కోరుకుంది. అందుకోసం ఆమె ఎంచుకున్న మార్గం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో నివాసముంటున్న జ్యువెల్ షుపింగ్ 21 ఏళ్లువయసులో.. తాను అంధురాలిగా మారాలని నిర్ణయం తీసుకుంది

Viral News: తన కలను నెరవేర్చుకోవడానికి చేతులారా కంటి చూపు పోగొట్టుకున్న యువతి.. ఆమె చెప్పిన రీజన్ తెలిస్తే షాక్..
Blind Woman
Surya Kala
|

Updated on: Sep 19, 2023 | 12:53 PM

Share

ప్రతి ఒక్కరికి తమ జీవితం గురించి రకరకాల ఆలోచనలుంటాయి. కొందరు సమాజంలో గొప్పగా జీవించాలనుకుంటే.. మరికొందరు భిన్నంగా జీవించాలనుకుంటారు. తాము కన్న కలలను నిజం చేసుకోవడానికి నిరంతరం కష్టపడతారు. అయితే ఎప్పుడైనా కాళ్లు లేకుండా కళ్లు లేకుండా జీవించాలని కోరుకుంటారని మీకు తెలుసా.. అసలు తాను అంధురాలిగా జీవించాలని కలలు కనడమే కాదు అందుకోసం బంగారంలాంటి చూపును పోగొట్టుకుంది. ఆ యువతి అమెరికాకు చెందినది. ఆమె వింత కోరిక.. అందు కోసం ఆమె చేసిన పని గురించి తెలుసుకుంటే షాక్ తినాల్సిందే.

అంధులు ఒక్కసారైనా ప్రకృతిని కనులారా చూడాలని కోరుకుంటారంటే అతిశయోక్తి కాదు. అయితే కాలిఫోర్నియాకు చెందిన ఒక మహిళ తన జీవితాన్ని అంధురాలిగా గడపాలని కోరుకుంది. అందుకోసం ఆమె ఎంచుకున్న మార్గం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో నివాసముంటున్న జ్యువెల్ షుపింగ్ 21 ఏళ్లువయసులో.. తాను అంధురాలిగా మారాలని నిర్ణయం తీసుకుంది. ఎవరైనా కంటి చూపు జీవితాంతం ఉండాలని కోరుకుంటారు.. కానీ  షుపింగ్ మాత్రం అందుకు భిన్నంగా కంటి చూపు లేకుండా అంధురాలిగా జీవించాలని కోరుకుంది. ఇదే విషయంపై ఆమె ఓ  సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ.. తనకు చిన్నప్పటి నుంచి ఓ కల ఉందని చెప్పింది.  తనను తాను అంధ బాలికగా చూసుకోవాలని కోరుకున్నట్లు తెలిపింది.

దీంతో షుపింగ్ తన కళ్లకు డ్రైన్‌ క్లీనర్‌ అప్లై చేసింది. దీంతో ఆమె కంటి చూపు పూర్తిగా కోల్పోయింది. తన  చూపుని కోల్పోయే ముందు బ్రెయిలీ లిపీ నేర్చుకుంది. తన కంటి చూపు కోల్పోయినప్పుడు చాలా సంతోషపడింది. అంతేకాదు తనకు చిన్న తనం నుంచి అంధుడిరాలిగా జీవించాలని కోరుకున్నానని తెలిపింది. తాను కన్న కలను చివరికి నెరవేర్చుకున్నానని సంతోషంగా చెప్పింది.

ఇవి కూడా చదవండి

అయితే సూపింగ్ చేతులారా అంధురాలిగా మారినందుకు కుటుంబ సభ్యులకు కోపం వచ్చింది. దీంతో ఆమెతో కుటుంబ సభ్యులు సంబంధాలు తెంపుకుంది. ఎందుకంటే తమ కూతురి కంటి చూపు కోల్పోయింది ప్రమాదం వలన అని మొదట తల్లి అనుకుంది. కూతురిని అక్కున చేర్చుని జాగ్రత్తగా చూసుకుంది. ఎప్పుడైతే తన కూతురు చేతులారా కంటి చూపుని పోగొట్టుకుంది తెలిసిందే.. వెంటనే కోపంతో తన కూతురితో సంబంధ బాంధవ్యాలను తెంపుకుంది.  జ్యువెల్ వయస్సు  ఇప్పుడు 38 సంవత్సరాలు. అయితే ఆమె BIID (బాడీ ఇంటెగ్రిటీ ఐడెంటిటీ డిజార్డర్)తో బాధపడుతున్నదని వైద్యులు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..