AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: తెలంగాణకు మరో 4 కేంద్రీయ విద్యాలయాలు.. ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెబుతూ కిషన్ రెడ్డి కీలక ట్వీట్..

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్.. మరికొన్ని కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిలో తెలంగాణలో నాలుగు కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి.. అయితే.. తెలంగాణలో నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు.

Kishan Reddy: తెలంగాణకు మరో 4 కేంద్రీయ విద్యాలయాలు.. ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెబుతూ కిషన్ రెడ్డి కీలక ట్వీట్..
Kishan Reddy Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Oct 01, 2025 | 6:10 PM

Share

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్.. మరికొన్ని కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిలో తెలంగాణలో నాలుగు కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి.. అయితే.. తెలంగాణలో నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. మారుమూల ప్రాంతాలలో నాణ్యమైన ప్రాథమిక, మాధ్యమిక విద్యను అందించడంలో ఈ నాలుగు కేంద్రీయ విద్యాలయాలు కీలకంగా మారనున్నాయని తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బుధవారం ప్రకటన విడుదల చేశారు.

‘‘11 ఏళ్లుగా తెలంగాణలో విద్యాభివృద్ధికి అన్నిరకాలుగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా.. మరో 4 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించింది. ఇప్పటికే ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాలకు తోడుగా ఈ నాలుగు విద్యాలయాలు మారుమూల ప్రాంతాల్లోనూ నాణ్యమైన ప్రాథమిక, సెకండరీ విద్యను అందించడంలో కీలకం కానున్నాయి. తెలంగాణలో విద్యాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ధన్యవాదములు’’.. అంటూ కిషన్ రెడ్డి ప్రకటనలో తెలిపారు.

తెలంగాణకు మంజూరైన కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..

1. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం (యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్)

2. ములుగు జిల్లా కేంద్రం (గిరిజన ప్రాంతం)

3. జగిత్యాల జిల్లా – జగిత్యాల రూరల్ మండలం – చెల్గల్

4. వనపర్తి జిల్లా- నాగవరం శివారు

ఇవి కాకుండా, గత రెండేళ్లలోనే.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నాణ్యమైన సెకండరీ విద్యను అందించేందుకు.. రూ.400 కోట్లతో 832 పీఎం-శ్రీ స్కూల్స్‌ను మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా పీఎంశ్రీ స్కూల్స్ కోసం ఎక్కువ కేటాయింపులు అందుకున్న రాష్ట్రం తెలంగాణనే కావడం విశేషం. ఇది కాకుండా.. సమగ్రశిక్షా అభియాన్ కింద గత రెండేళ్లలో.. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం.. దాదాపు రూ.2వేల కోట్లను కేటాయించింది. దాదాపు వెయ్యికోట్లతో.. ములుగు జిల్లాలో సమ్మక్క, సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణలో విద్యాభివృద్ధికి పూర్తి మద్దతు అందించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..