Rain Alert: దూసుకొస్తున్న వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో నాన్‌స్టాప్ వానలే వానలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు పేర్కొంది. ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతానికి విశాఖపట్నంకి 400 కి.మీ., గోపాల్‌పూర్ (ఒడిశా)కి 420 కి.మీ పారాదీప్ (ఒడిశా)కి 500 కిమీ దూరంలో కేంద్రీకృతం అయిందని పేర్కొంది.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు పేర్కొంది. ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతానికి విశాఖపట్నంకి 400 కి.మీ., గోపాల్‌పూర్ (ఒడిశా)కి 420 కి.మీ పారాదీప్ (ఒడిశా)కి 500 కిమీ దూరంలో కేంద్రీకృతం అయిందని పేర్కొంది. వాయుగుండం మరింత బలపడి.. శుక్రవారం తెల్లవారుజామున గోపాల్‌పూర్-పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా.. వాయుగుండం నేపథ్యంతో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ కు వారం రోజుల పాటు వర్ష సూచన చేసింది.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన చేయడంతోపాటు.. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వాయుగుండం ప్రభావంతో గురువారం ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది. దక్షిణకోస్తాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని.. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
మరోవైపు తెలంగాణలోనూ మూడు, నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. గురువారం, శుక్రవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




