AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSCTU: సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ లోగో ఆవిష్కరణ.. ఎలా ఉందో చూశారా..?

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ధర్మేంద్ర ప్రధాన్‌ సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగోను ఆయన ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ “జ్ఞానం పరమం ధ్యాయం” అనే నినాదంతో, ఇది అనువర్తిత, పరిశోధన, ఆవిష్కరణ-ఆధారిత విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

SSCTU: సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ లోగో ఆవిష్కరణ.. ఎలా ఉందో చూశారా..?
Sammakka Sarakka Central Tribal University Logo
Shaik Madar Saheb
|

Updated on: Oct 07, 2025 | 9:23 PM

Share

సాంస్కృతిక వారసత్వం, సంచార జాతుల ప్రజలు ఉండే ప్రాంతంలో సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పడుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. అత్యుత్తమ రీసెర్చ్ యూనివర్సిటీగా సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిలుస్తుందని.. ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు.. మంగళవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ధర్మేంద్ర ప్రధాన్‌ సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగోను ఆయన ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ “జ్ఞానం పరమం ధ్యాయం” అనే నినాదంతో, ఇది అనువర్తిత, పరిశోధన, ఆవిష్కరణ-ఆధారిత విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. యూనివర్సిటీ ద్వారా చాలా విషయాలు వెలుగులోకి తేవచ్చని ధర్మేంద్ర ప్రదాన్ చెప్పుకొచ్చారు. తెలుగు, హిందీ, మరాఠీతో సహా లోకల్ ట్రైబల్ భాషలను మెరుగు పరచవచ్చని వెల్లడించారు. తెలంగాణలోని SSCTU ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్ష.. విద్యా సమానత్వం, గిరిజన సాధికారత, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల నెరవేర్పు పట్ల అచంచలమైన నిబద్ధతను చూపిస్తుందని ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలు సామాజిక అవసరాలను తీర్చడానికి ఆవిష్కరణ కేంద్రాలుగా ఉండాలన్నారు. త్వరలో సమ్మక్క సారక్క యూనివర్సిటీని సందర్శించి..కొత్త క్యాంపస్ కి శంకుస్థాపన చేస్తానని ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు.

సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ లోగో ఎలా ఉందంటే..

సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ లోగో మధ్యలో సమ్మక్క సారక్కల పసుపు బొమ్మలను ఏర్పాటుచేశారు. సమ్మక్క, సారక్క దేవతల కుంకుమను సూచించేలా మధ్యలో ఎర్రటి సూర్యుడి బొమ్మతో లోగోను రూపొందించారు. ప్రశాంతమైన ఆధ్యాత్మిక కోణాన్ని జోడించే పీఠాలపై ఉన్న దైవిక ద్వయం.. గద్దెల చిహ్నాలను ఏర్పాటుచేశారు. గిరిజన దుస్తులు, సౌందర్యానికి అంతర్భాగంగా నెమలి ఈకలు ఏర్పాటుచేశారు. సాంస్కృతిక గౌరవం, ధైర్యం, సంప్రదాయాన్ని సూచించే రెండు కోణాల జంతువుల కొమ్ములతో కూడిన కిరీటాన్ని ఏర్పాటుచేశారు.

ఈ లోగో గిరిజన సంస్కృతికి అద్దం పడుతుందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వివరించారు. సమ్మక్క సారక్క యూనివర్సిటీ గిరిజన సంస్కృత వారసత్వాన్ని అందించడంతోపాటు.. జ్ఞానానికి కేంద్రంగా.. విద్యా నైపుణ్యానికి ఒక దీపస్తంభంగా మారుతుందని పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం