AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మధ్యప్రదేశ్ నుంచి ఖమ్మం అధికారులకు ఫోన్.. కట్ చేస్తే, పెద్ద బండారమే బయటపడిందిగా..

ఆ కలప రవాణా చేయాలంటే ఎంతో మంది అధికారుల అనుమతి కావాలి. కానీ అవేవీ లేకుండానే ఆ కలప అడవి దాటిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఓ బీట్ ఆఫీసర్ పై చర్యలు తీసుకున్నారు. పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Telangana: మధ్యప్రదేశ్ నుంచి ఖమ్మం అధికారులకు ఫోన్.. కట్ చేస్తే, పెద్ద బండారమే బయటపడిందిగా..
Khammam Forest Scam
Shaik Madar Saheb
|

Updated on: Oct 08, 2025 | 9:57 AM

Share

ఖమ్మం జిల్లా అటవీ శాఖలో దోపిడీ జరిగింది. అయితే ఇదంతా ఇంటి దొంగలు పనే అని తేల్చారు ఉన్నతాధికారులు. కలప అక్రమ రవాణాలో ఎవరెవరి ప్రమేయం ఉందనే దానిపై జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ​సిద్ధార్థ్ విక్రమ్ ​సింగ్ నేతృత్వంలో టాస్క్​ ఫోర్స్ ​రేంజ్​ఆఫీసర్లు దర్యాప్తు చేపట్టారు. చింతకాని మండలం నుంచి సర్కారు తుమ్మ కలప తరలించేందుకు ముందుగా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్‌ తీసుకుని, అనంతరం సూర్యాపేట, మహబూబాబాద్ ​జిల్లాలోని ప్రైవేట్ భూముల్లో నరికిన సండ్ర కలపను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు బహిర్గతమైంది. అయితే ఎలాంటి ఫీల్డ్ వెరిఫికేషన్​ లేకుండా, వాల్టా ఫీజు వసూలు చేయకుండా, నేషనల్ ట్రాన్సిట్ పాస్ ​సిస్టమ్ద్వారా ఆన్​లైన్ లో ఎన్​వోసీలను జారీ చేసినట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తులో భాగంగా చింతకాని ఫారెస్ట్ బీట్​ ఆఫీసర్‌ను సస్పెండ్​ చేశారు. సండ్ర చెట్టు దుంగల అక్రమ రవాణాపై ఎంక్వైరీ చేస్తున్నామని ఖమ్మం DFO సిద్దార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు.

పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని DFO తెలిపారు. చట్టవిరుద్ధ పనుల్లో పాల్గొన్న అధికారులు, వ్యక్తులపైనా క్రిమినల్ చర్యలు ఉంటాయన్నారు. గుట్కా వంటి పాన్​మసాలాల తయారీలో, పాన్​లో ఉపయోగించే కత్తా తయారీలో సండ్ర కలపను వినియోగిస్తారని అధికారుల ఎంక్వైరీలో తేలింది. మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానాలో ఇలాంటి పరిశ్రమలు ఉండగా.. అక్కడ కలపకు విపరీతమైన డిమాండ్​ ఉంది. దీంతో తెలంగాణ జిల్లాల్లోని విలువైన సండ్ర కలపను తరలించేందుకు ఫేక్​ఎన్వోసీ రూట్ ను స్మగ్లర్లు ఎంచుకున్నట్టు అధికారులు గుర్తించారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం