Telangana Cabinet: ధరణి ఔట్.. కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్..! తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అంశాలకు మంత్రివర్గం ఆమోదమద్ర వేసింది. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అంశాలకు మంత్రివర్గం ఆమోదమద్ర వేసింది. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ అయ్యింది. సుమారు గంటన్నర పాటు తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో అనేక కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇందులో భాగంగా.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన పలు బిల్లులపై మంత్రివర్గం చర్చించింది.
6 గ్యారంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు తెల్లరేషన్ కార్డునే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి విపరీత డిమాండ్ ఏర్పడింది. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో 2 రోజుల క్రితం ప్రకటించారు. ఈ మేరకు రేషన్ కార్డుల జారీకి అర్హతలు, విధి విధానాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించింది. ఈ మేరకు విధివిధానాల ఖరారుకు కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటుకు ఆమోదముంద్ర వేసింది కేబినెట్. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడివిడిగా ఇవ్వాలని నిర్ణయించింది.
అలాగే, స్కిల్ యూనివర్సిటీ, రేషన్ కార్డులు, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధివిధానాలపై చర్చించింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ, RRR పరిధిలోని పంచాయతీలను కార్పొరేషన్లలో విలీనం చేయడంపై చర్చించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు. ఇక.. క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్‌కు ఆర్థిక సాయంతోపాటు గ్రూప్-1 ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.
ఇక ధరణి స్థానంలో కొత్తగా భూమాత పేరుతో సేవలు అందుబాటులోకి తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే గౌరవెల్లి ప్రాజెక్టు రూ.437 కోట్లను కేటాయిస్తూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇంకా జాబ్ కేలండర్ ను సైతం ఆమోదించింది. ప్రకృతి విపత్తుతో విలవిలలాడిన వాయనాడ్ ప్రాంతానికి అండగా ఉండాలని కేబినెట్ నిర్ణయించింది. మృతులకు సంతాపం తెలిపిన తెలంగాణ కేబినెట్, అక్కడి బాధితులకు సాయం చేయాలని నిర్ణయించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..